రాజ్ తరుణ్ తో రెండుసార్లు ఆ అనుభవం.. అలా కావాలని కోరుకున్నా: అరియనా

Ariyana Glory Comments On Raj Tarun In Anubhavinchu Raja Promotions

బిగ్ బాస్ బ్యూటీ అరియానా తాజాగా

హీరో రాజ్ తరుణ్

పై సంచలన వ్యాఖ్యలు చేసింది.హీరో రాజ్ తరుణ్ అంటే తనకు నచ్చదని, తనకు యాక్సిడెంట్ కావాలని కోరుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

 Ariyana Glory Comments On Raj Tarun In Anubhavinchu Raja Promotions-TeluguStop.com

హీరో రాజ్ తరుణ్ తాజాగా నటించిన సినిమా అనుభవించు రాజా. ఇటీవలే ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అరియానా కూడా ఒక పాత్రలో నటించింది.ఈ క్రమంలోనే ఈ సినిమా టీం తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది అరియానా.

 Ariyana Glory Comments On Raj Tarun In Anubhavinchu Raja Promotions-రాజ్ తరుణ్ తో రెండుసార్లు ఆ అనుభవం.. అలా కావాలని కోరుకున్నా: అరియనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే అరియనా దర్శకుడిని, హీరో రాజ్ తరుణ్ ని ఆట పట్టించింది.ఈ సందర్బంగా అరియనా మాట్లాడుతూ.నిజం చెప్పాలి అంటే ఒకప్పుడు రాజ్ తరుణ్ అంటే నాకు అస్సలు నచ్చదు.కాని తనతో సినిమాను ఎలా చేసానో అర్థం కావడం లేదు.

టీవీలో ఆయన సినిమాలు వస్తే అవి తీసేయమని చెప్పేదాన్ని.ఒక రోజు కార్ లో రాజ్ తరుణ్ వెళుతుంటే తనకు యాక్సిడెంట్ కావాలని కోరుకున్న అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఎందుకు అంత అసహ్యం అని అడగగా.ఇలాగే ఒక ఇంటర్వ్యూకి పిలిచారు అప్పుడు చాలా సేపు వెయిట్ చేయించాడు.

Telugu Ariyana, Raj Tarun, Raj Tharun-Movie

నా ముందే కారులో వెళ్తుంటే హీరో వెళ్లిపోతున్నాడు అని అడగగా డబ్బింగ్ కరెక్షన్ ఉందని వెళుతున్నాడని చెప్పారు.అంతకు ముందు కూడా ఓ ఛానల్ లో చేసేటప్పుడు రాజ్ తరుణ్ ని తెలుగు చేయాల్సి ఉంది.వాళ్ల సినిమా చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది.ఇక హీరోతో ఇంటర్వ్యూ అని చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను.ఎంతసేపు వెయిట్ చేసినా హీరో మాత్రం రాలేదు.చివరకు సినిమా హిట్ అయిందని సార్ వెళ్లిపోయారని చెప్పారు.

అలా రెండు సార్లు నాకు రాజ్ తరుణ్ వల్ల చేదు అనుభవం ఎదురయింది అందుకే కారులో వెళ్తుంటే కాలో.చెయ్యో విరగగాలి అని అనుకున్నా అంటూ చెప్పుకొచ్చింది

.

#Raj Tarun #Raj Tharun #Ariyana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube