టీవీ షోలకు దూరంగా అరియానా.. ఆ సమస్య వల్లే..?

బిగ్ బాస్ సీజన్ 4లో ఎలాంటి గుర్తింపు లేకుండా ఎంట్రీ ఇచ్చి ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు అరియానా గ్లోరీ.టాప్ 4 కంటెస్టెంట్ గా నిలిచిన అరియానా గ్లోరీ లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకోవడంతో పాటు హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత సినిమాల్లో హీరోయిన్ ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు.

 Actress Ariyana Clarity  About Her Health , Ariyana Glory, Clarity About Her Hea-TeluguStop.com

స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ షోలో అవినాష్ చేసే స్కిట్లలో పాల్గొని అరియానా పంచ్ లు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు.

అయితే గత కొన్ని వారాల నుంచి అవినాష్ చేసే స్కిట్లలో అరియానా కనిపించడం లేదు.

అరియానా ఇలా టీవీ షోలకు దూరంగా ఉండటానికి తీవ్ర జ్వరం కారణమని తెలుస్తోంది.గత కొన్నిరోజులుగా జ్వరంతో బాధ పడుతున్న అరియానా తనకు జ్వరం తగ్గిందని జ్వరం వల్లే టీవీ షోలకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

తను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించిన వారందరికీ థ్యాంక్స్ అని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Ariyana, Ariyana Glory, Avinash, Stars Show, Kalyan Dev, Raj Tarun-Movie

ప్రస్తుతం అరియానా రాజ్ తరుణ్ సినిమాతో పాటు కళ్యాణ్ దేవ్ సినిమాలో కూడా నటిస్తున్నారు.జ్వరం తగ్గడంతో వెండి తెరపై, బుల్లితెరపై అరియానా సందడి మొదలైనట్లేనని చెప్పవచ్చు.రాజ్ తరుణ్, కళ్యాణ్ దేవ్ తో అరియానా నటిస్తున్న సినిమాలు హిట్టైతే మాత్రం ఆమె మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.

సోషల్ మీడియాలో కూడా అరియానాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టు తెలుస్తోంది.

అవినాష్ తో కలిసి అరియానా చేసిన స్కిట్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

బిగ్ బాస్ షో ద్వారా 25 లక్షల రూపాయలకు అటూఇటుగా సంపాదించిన అరియానా సినిమాలకు ప్రస్తుతం తక్కువ మొత్తమే రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని సమాచారం.రాబోయే వారాల్లో ప్రసారం కాబోయే కామెడీ స్టార్స్ షోలో అరియానా కనిపించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube