Ariyana Phone Number: వైరల్ అవుతున్న అరియానా ఫోన్ నెంబర్.. క్లారిటీ ఇచ్చిన బుల్లితెర ఇలియానా?

కొందరు మోసగాళ్లు సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ ఉంటారు.వారి గురించి ఫేక్ డీటెయిల్స్ పెట్టి వారిని మీడియా ముందుకు వచ్చేలా చేస్తారు.

 Ariyana Clarity On Phone Number Viral On Social Media Details, Ariana,phone Numb-TeluguStop.com

అంతేకాకుండా వారికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలు కూడా హ్యాక్ చేసి వారిని బాగా ఆడుకుంటూ ఉంటారు.ముఖ్యంగా వారి పేరు మీద ఫేక్ ఫోన్ నెంబర్ లను పెట్టి వాటిని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తూ ఉంటారు.

ఇప్పటికి చాలా మంది సెలబ్రెటీలు తమ పేర్ల మీద వచ్చిన ఫేక్ నెంబర్లకు స్పందించారు.అయితే తాజాగా మరో బుల్లితెర ఆర్టిస్ట్ నెంబర్ కూడా బయటపడింది.ఇంతకూ ఆమె ఎవరో కాదు.బుల్లితెర ఇలియానా గా పేరు సంపాదించుకున్న అరియానా.

టాలీవుడ్ బుల్లితెరకు ఆర్టిస్టుగా పరిచయమైన యాంకర్ అరియానా గురించి అందరికీ పరిచయమే.

ఈమె మొదట్లో యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా చేస్తూ ఉండేది.

అయితే ఓసారి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ చేయడంతో అప్పటి నుండి అందరి దృష్టిలో పడింది.దీంతో ఆమెకు వెంటనే బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది.

Telugu Anchor Ariyana, Ariana, Ariyana Fans, Ariyana Glory, Ariyana Offers, Ariy

ఇక ఆ షోలో బోల్ట్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి బాగా రచ్చ చేసింది.మరో కంటెస్టెంట్ సోహెల్ తో బాగా రచ్చ రచ్చ చేసింది.ఆ తర్వాత షో నుండి బయటకు వచ్చాక తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.ఇక యూట్యూబ్లలో పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.దీంతో అక్కడ కూడా మంచి గుర్తింపు అందుకుంది.

ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ లో కూడా యాంకర్ గా చేసింది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడిపేస్తుంది.

తనకు సంబంధించిన డాన్స్ వీడియోలను, ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇక ఈ మధ్య మాత్రం ఈమె చాలా బోల్డ్ గా కనిపిస్తుంది.

హీరోయిన్ లు చేసే ఎక్స్పోజ్ లు ఈమె కూడా చేస్తూ అందరి దృష్టిలో పడుతుంది.

Telugu Anchor Ariyana, Ariana, Ariyana Fans, Ariyana Glory, Ariyana Offers, Ariy

బాగా ఫోటోషూట్లు చేయించుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.ఫ్రెండ్స్ అంటూ వారితో బాగా చిల్ అవుతూ కనిపిస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన పేరు మీద ఉన్న ఒక ఫోన్ నెంబర్ బయటపడింది.

అయితే ఆ ఫోన్ నెంబర్ తనది కాదు అది ఫేక్ నెంబర్ అంటూ తన ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తూ తెలిపింది.ఆ నెంబర్ కి ఎవరు ఫోన్ చేయకండి అంటూ.

అది ఫేక్ నెంబర్.తన నెంబర్ కాదు అంటూ ఎవరో కావాలనే తనను అలా టార్గెట్ చేశారు అంటూ తెలిపింది.

ఇక ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube