కొత్త కారు కొన్న అరియనా.. అతనితో ఫస్ట్ రైడ్‌కు వెళ్లడంతో లవ్ ట్రాక్ నడుస్తుందంటూ?

బిగ్ బాస్ సీజన్ 4 బోల్డ్ బ్యూటీ అరియానా ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.బిగ్ బాస్ తర్వాత ఎనలేని క్రేజ్ ను సంపాదించుకొని మంచి సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.

 Ariyana Bought A New Car Ride With Sohel-TeluguStop.com

అంతేకాకుండా పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుని బాగా బిజీగా మారింది.అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకున్న అరియానా తాజాగా కొత్త కారును కొన్నది.

అంతేకాకుండా అతనితో ఫస్ట్ రైడ్ కు వెళ్లడంతో లవ్ ట్రాక్ నడుస్తుందని నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

 Ariyana Bought A New Car Ride With Sohel-కొత్త కారు కొన్న అరియనా.. అతనితో ఫస్ట్ రైడ్‌కు వెళ్లడంతో లవ్ ట్రాక్ నడుస్తుందంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదట తన కెరీర్ ను యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది.ఇక అసలైన కెరీర్ ఇక్కడి నుండే ప్రారంభమమైంది.ఓసారి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేయగా.

ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.కేవలం ఒక్క ఇంటర్వ్యూ తో వర్మ చేతిలో చిక్కిన అరియానా బాగా హాట్ టాపిక్ గా మారి క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.ఇక అందులో తన పరిచయాన్ని మరింత పెంచుకుంది.ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ సోహెల్ తో బద్ధశత్రువుగా ఉండేది.నిజానికి హౌస్ లో వీరిద్దరు టామ్ అండ్ జెర్రీ గా నిలిచారు.ఆ తర్వాత చివరి కొన్ని రోజుల్లో మంచి ఫ్రెండ్స్ గా మారారు.

అలా హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది.

ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్లేవాళ్లు.ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకునే వాళ్ళు.అంతే కాకుండా వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునేవాళ్ళు.

దాంతో వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.ఇక ఇదిలా ఉంటే తాజాగా అరియానా కొత్త కారును కొనుగోలు చేసింది.

ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.ఇందులో అరియానా తో పాటు సోహెల్, అమర్ దీప్ కూడా ఉండగా అందులో కారును సోహెల్ డ్రైవ్ చేసినట్లు కనిపించింది.

బిగ్ బాస్ షో కంటే ముందే అరియానా, బుల్లితెర నటుడు అమర్ దీప్ మంచి స్నేహితులు.ఇక బిగ్ బాస్ తర్వాత సోహెల్ కూడా మంచి స్నేహితుడయ్యాడు.దీంతో అరియానా అమర్ దీప్ తో కలిసి సోహెల్ ను ఆహ్వానించి.మొదట రైడ్ ను కూడా సోహెల్ తోనే చేయించింది.అంతేకాకుండా ఆయుధపూజ కూడా చేయించింది.దీంతో ప్రస్తుతం నెట్టింట్లో అరియానాకు అభిమానులంతా కంగ్రాట్స్ చెప్పగా కొంతమంది నెటిజన్లు నిజంగానే సోహెల్ తో లవ్ ట్రాక్ నడిపిస్తుంది అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

#AriyanaSohel #Ariyana Car #Car #AriyanaCar #AriyanaGlory

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు