ప్రేమోన్మాదం కు బలైన మరో బాలిక

Arifa Study Terrace In Hyderabad

ప్రేమోన్మాది ఘాతుకానికి మరో బాలిక బలైనట్లు తెలుస్తుంది.చదువుకోవడానికి టెర్రస్ పైకి వెళ్లిన బాలిక తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయినా ఘటన హైదరాబాద్ లోని చిలకలగూడ పరిధి లో చోటుచేసుకుంది.

 Arifa Study Terrace In Hyderabad-TeluguStop.com

పోలీసులు తెలిపిన కధనం ప్రకారం….చిలకలగూడ పరిధిలోని వారాసిగూడ లో ఒక అపార్ట్ మెంట్ లో ఆ బాలిక నివాసం ఉంటుంది.

తండ్రి ఏడాది క్రితం చనిపోవడం తో తన తల్లి,తమ్ముడు,సోదరి తో కలిసి ఆ బాలిక ఉంటుంది.అయితే షోయబ్ అనే యువకుడు చాలా రోజులుగా ప్రేమ పేరుతో ఆ బాలిక వెంటపడుతున్నారు.

ఈ క్రమంలో ఆ బాలికను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమె తల్లితో మాట్లాడి రావాల్సిందిగా తన కుటుంబ సభ్యులను కూడా పంపినట్లు తెలుస్తుంది.అయితే తన కుమార్తె మైనర్ అని, చదువుకుంటోదని, తనకు ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదని ఆమె తల్లి తిరస్కరించింది.

అయితే నిన్న రాత్రి చదువుకునేందుకని ఆ బాలిక టెర్రస్ పైకి వెళ్లి, ఎంతకీ తిరిగి రాలేదు.దీనితో ఆందోళన చెందిన ఆ బాలిక కుటుంబ సభ్యులు టెర్రస్ పైన చూసినా ప్రయోజనం లేకపోయింది.

అయితే ఈ రోజు ఉదయం అపార్ట్ మెంట్ లోని ఓ మహిళ టెర్రస్ పైకి వెళ్లగా, ఒక చోట రక్తపు మరకలు కనిపించాయి.దీనితో అనుమానం వచ్చిన ఆ మహిళ అటువైపు గా తొంగి చూడడం తో రెండు అపార్టుమెంట్ ల మధ్య బాలిక విగత జీవిలా పడిఉంది.

దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు భోరుమన్నారు.స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే టెర్రస్ పై ఉన్న పరిస్థితులు, రక్తపు మరకలు గమనించిన పోలీసులు బాలిక పై అత్యాచారం చేసి ఆ తరువాత టెర్రస్ పై నుంచి కిందకు తోసేసి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు,రిపోర్ట్ వచ్చిన తరువాతే అసలు విషయం తెలుపుతామని పోలీసులు తెలిపారు.

#Terrace #Arifa #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube