ప్రేమలో పడ్డానంటున్న అరియనా గ్లోరీ.. వైరల్ పోస్ట్!

బిగ్ బాస్ సీజన్ 4 బోల్డ్ బ్యూటీ అరియానా.బోల్డ్ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ముక్కుసూటి అమ్మాయిగా నిలిచింది.

 Ariyana Glory, Bigg Boss, Viral Post, Love ,social  Media,virla Latest News-TeluguStop.com

హౌస్ లో ఉన్నంత కాలం తనదైన శైలితో ఆటలో పాల్గొని చివరి వరకు నిలిచి సెలబ్రిటీ హోదాను అందుకుంది.అంతేకాకుండా మంచి ఫాలోయింగ్ కూడా అందుకుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బోల్డ్ బ్యూటీ.ఇక ప్రేమలో పడ్డాను అంటూ ఓ పోస్టు చేసింది అరియనా.

Telugu Ariyana Glory, Bigg Boss, Love, Netizens-Movie

నిజానికి బిగ్ బాస్ లో అడుగుపెట్టిన మొదటిరోజు ఈమె పరిచయం ఎవరికీ తెలియదు.కానీ బిగ్ బాస్ తర్వాత ఈమె క్రేజ్ మారడమే కాకుండా వరుస ఆఫర్లు కూడా అందుకుంది.బిగ్ బాస్ ముందు యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చేస్తూ ఉండే అరియానా. రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేసి మొత్తానికి సెలబ్రిటీగా మారింది.ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన బోల్డ్ కామెంట్స్ తో బిగ్ బాస్ అవకాశం అందుకుంది.

Telugu Ariyana Glory, Bigg Boss, Love, Netizens-Movie

ఇటీవలే మళ్లీ రామ్ గోపాల్ వర్మ తో మరో బోల్డ్ ఇంటర్వ్యూ చేయగా అది ఎంత వైరల్ గా మారిందో చూసాం.అతనితో జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ బోల్డ్ కామెంట్స్ తో బాగా రెచ్చిపోయారు.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే అరియనా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ సెల్ఫీ వీడియో షేర్ చేసింది.

అందులో ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్న అంటూ.గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నా అనగా మరి మీరు కూడా ఇలానే ప్రేమిస్తున్నారా అని అభిమానులను ప్రశ్నించింది.

ఇక దీంతో ఆమె ప్రేమించేది ఎవరినో కాదని తనను తానే ప్రేమించుకుంటున్నానని షాక్ ఇచ్చింది.ఇక ఈ బ్యూటీ త్వరలో వెండి తెరపై కూడా కనిపించనుంది.ఇప్పటికే రాజ్ తరుణ్, కళ్యాణ్ దేవ్ సినిమాలో నటించగా పలు షోలలో కూడా చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube