అతడిని ఊసరవెల్లి అంటున్న అరియానా..!  

గత 70 రోజులకు పైగా కొనసాగుతున్న బిగ్ బాస్ 4 సీజన్ చివరిదశకు దగ్గరవుతుంది.ఈ సీజన్ లో అవినాష్, అరియాన జంట కాస్త డిఫరెంట్ అని చెప్పవచ్చు.

TeluguStop.com - Ariana Calling Him A Chameleon

వారిద్దరు పోటీపడి మరి ఇంట్లో తెగ హడావిడి చేస్తూ ఉంటారు.అయితే వీరిద్దరూ బిగ్ బాస్ ఇంట్లో హడావిడి చేస్తుంటే వారిద్దరిపై సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పడుతున్నాయి.

వీరిద్దరికి జట్టు కుదిరిందని అందరూ భావిస్తున్నారు.అయితే వీరు చేసే అల్లరి కొన్ని సమయాల్లో కరెక్ట్ అనిపించిన మరికొన్నిసార్లు కాస్త అతి కనిపిస్తుంది.

TeluguStop.com - అతడిని ఊసరవెల్లి అంటున్న అరియానా..-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా జరిగిన ఓ ఎపిసోడ్ లో అవినాష్ కు అరియాన ఇచ్చిన మనోధైర్యం అందరికీ ముచ్చటేసింది.వీరిద్దరూ చేసిన ప్రచారం బాగానే కొనసాగింది.

ఆ రోజు ఎపిసోడ్ లో ప్రస్తుతం నడుస్తున్న 12 వారానికి సంబంధించి నామినేటెడ్ అయిన వ్యక్తులను సేవ్ చేసేందుకు ఓ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్.ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ లతో ఆట ఆడించాడు.

ఇందులో భాగంగా మొదటి లెవెల్ లో జెండాలు సేకరించాలని చెప్పి అందులో ఎవరు ఎక్కువ జెండాలు సేకరిస్తే వారు రెండు లెవెల్ కి అర్హత సాధిస్తారు అని తెలిపాడు.ఆ రెండు లెవెల్ లో అఖిల్, అవినాష్ ఇద్దరు ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది.

వారిద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారికే ఫ్రీ పాస్ వస్తుందని బిగ్ బాస్ తెలిపాడు.ఇందులో భాగంగా అవినాష్ కు అరియాన నుండి మంచి సపోర్ట్ లభించింది.

ఆ సమయంలో నెటిజన్లు అరియాన లాంటి స్నేహితులు ఉండాలని ఆమెను ఆకాశానికి ఎత్తేశారు.అయితే ఆ తర్వాత మాత్రం అవినాష్ నామినేషన్స్ లో ఉంటే ఒక విధంగా, లేకపోతే మరోవిధంగా ఉంటాయని సోహెల్ అఖిల్, అరియాన లు అవినాష్ ఆట పట్టించారు.

అయితే ఇందులో భాగంగా మార్నింగ్ మస్తీ తర్వాత అఖిల్ సోహెల్ వద్దకు వెళ్లి అవినాష్ డాన్సులు చేస్తున్నాడు.అతడికి ఏవిక్షన్ ఫ్రీ పాసులు రావడంతో అవినాష్ మారిపోయాడని సోహెల్ అరియానతో చర్చించాడు.అందుకు సమాధానంగా అరియాన అవినాష్ ను ఊసరవెల్లి అంటే అవినాషే అంటూ కౌంటర్ వేసింది.ఈ మాట విన్న అవినాష్ అక్కడే ఉన్న గానీ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి సైలెంట్ గా పక్కకి తప్పుకున్నాడు.

#Abijith #Ariyana #Big Boss 4 #Sohail #Chameleon

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ariana Calling Him A Chameleon Related Telugu News,Photos/Pics,Images..