డబ్బు కోసం సమంత కేసు వెయ్యలేదు.. అసలు విషయం చెప్పిన లాయర్?

Arguments Concluded Kukatpally Court Over Samantha Petition

గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో సమంతా గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.సమంత నాగ చైతన్య కేవలం విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటన చేయగానే చాలామంది సమంతను నిందిస్తూ ఎన్నో వార్తలను, అసభ్య పదజాలం ఉపయోగించే వార్తలు రాయడంతో తనకు పరువు నష్టం కలిగిందని భావించి సమంత కూకట్ పల్లి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి మనకు తెలిసిందే.

 Arguments Concluded Kukatpally Court Over Samantha Petition-TeluguStop.com

ఈ క్రమంలోనే నిన్న జరిగిన వాదనలో కోర్టు సమంతను ఉద్దేశిస్తూ కోర్టులో పరువు నష్టం దావా వేసే బదులు వారినుంచి క్షమాపణలు అడగొచ్చు కదా అంటూ ప్రశ్నించింది.

ఈ క్రమంలోనే సమంత లాయర్ మాట్లాడుతూ సమంత కేవలం డబ్బు కోసం కోర్టులో పరువు నష్టం దావా వేయడం లేదని, ఇంక వీరు విడాకులు తీసుకోకుండానే సమంతను కించపరిచే విధంగా కథలు వస్తున్నాయి అంటూ సమంత తరపు న్యాయవాది కోర్టుకు వివరణ ఇచ్చారు.

 Arguments Concluded Kukatpally Court Over Samantha Petition-డబ్బు కోసం సమంత కేసు వెయ్యలేదు.. అసలు విషయం చెప్పిన లాయర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేవలం సమంత పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కోర్టుకు వివరణ తెలిపారు.

సమంత డబ్బు కోసం కోర్టులో పరువు నష్టం దావా వేయలేదని, రాజ్యాంగం తన హక్కుల అన్నింటిని కాలరాస్తూ, తన వ్యక్తిగత జీవితంపై అనేక దుష్ప్రచారాలను చేస్తున్నారని ఈ సందర్భంగా లాయర్ బాలాజీ పేర్కొన్నారు.

నిన్న జరిగిన విచారణలో ఎలాంటి తీర్పును ప్రకటించని కోర్టు నేడు ఈ విషయంపై తన తీర్పును తెలియజేయనుంది.

#Kukatpally #Samantha #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube