ఆమ్లెట్ విషయంలో బలైన నిండు ప్రాణం..

ఈ మధ్య ఎవరిని ఎందుకు చంపుకుంటున్నారో తెలియడం లేదు.చిన్న విషయాలకు కూడా చంపుకునే వరకు వెళ్తున్నారు.

 Argument On Omelet Issue Hyderabad Man Died-TeluguStop.com

రిమోట్ ఇవ్వలేదని, అమ్మాయి ప్రేమించలేదని ఇలాంటి చిన్న చిన్న కారణాలకు కూడా నిండు ప్రాణాన్ని బలితీసుకుంటున్నారు.

మనుషులలో ఓపిక నశిస్తుంది.

 Argument On Omelet Issue Hyderabad Man Died-ఆమ్లెట్ విషయంలో బలైన నిండు ప్రాణం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క్షణికావేశంలో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు.ప్రాణం తీసిన తర్వాత తెలుస్తుంది వారు ఎంత తప్పు చేసారో.

సరిగ్గా ఇలాంటి ఆవేశంతోనే ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని తీసాడు.ఆమ్లెట్ విషయంలో జరిగిన వాగ్వివాదం కారణంగా క్షణికావేశంలో ఒక మనిషినే పొట్టన పెట్టుకున్నాడు.

తాజాగా ఆమ్లెట్ విషయంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం చెలరేగింది.ఆ చిన్న వివాదం కాస్తా చంపుకునేంత వరకు వెళ్ళింది.ఈ సంఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ లో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

లంగర్ హౌస్ కు చెందిన వికాస్ అనే వ్యక్తి ఆదివారం ఉప్పల్‌లోని మహంకాళి వైన్స్‌కు ఫీర్జాదిగూడలో ఉండే తన స్నేహితుడు బబ్లుతో కలిసి వెళ్ళాడు.వికాస్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే తన స్నేహితుడితో కలిసి వెళ్ళిన వికాస్ మద్యం కొనుక్కుని పర్మిట్ రూమ్ లో తాగడానికి వెళ్ళాడు.అక్కడే కూర్చుని తాగడం మొదలుపెట్టాడు.ఆమ్లెట్ కోసం అక్కడ ఒక దుకాణంలో ఆర్డర్ చేసాడు.అయితే ఆ దుకాణం యజమాని ఆమ్లెట్ కోసం 60 రూపాయలు చెల్లించాల్సిందిగా వికాస్ కు చెప్పాడు.

అయితే ఈ విషయంలో వికాస్ కు షాప్ యజమాని మధ్య వాగ్వివాదం చెలరేగింది.తీవ్ర ఆవేశానికి లోనైనా దుకాణం యజమాని వికాస్, బబ్లు పై తన సిబ్బందితో దాడి చేయించాడు.

ఈ దాడిలో వికాస్ తీవ్రంగా గాయపడ్డాడు.కొద్దీ సేపటికే వికాస్ మరణించాడు.

ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని అక్కడకు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

#Hyderabad #UppalMahankali #Omelet #Omelette Issue #ArgumentOn

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు