తండ్రితో వాదించి మ‌రీ సాధించాడు.. వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో స్పిన్ బౌల‌ర్ ర‌వి

క్రికెట్ కు సంబంధించిన వార్తలు అంటేనే యూత్ నుంచి వృద్ధాప్యం వారి దాకా అంద‌రికీ క్రేజ్ ఉంటుంది.మ‌న దేశంలో క్రికెట్‌కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మ‌రి.

 Argued With His Father And Achieved Much ..spin Bowler Ravi In West Indies T20 Series , Spin Bowler Ravi , Cricket , Ravi Bishnoi , West Indies T20 , Rajasthan Royals-TeluguStop.com

చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌రి నుంచి పెద్ద వారి దాకా అంద‌రూ క్రికెట్ ను అంత‌లా ఇష్ట‌ప‌డుతుంటారు.అయితే క్రికెట్ అనేది సినిమాలా కాదు.

ఎందుకంటే సినిమాల్లో వార‌స‌త్వాలు ఉంటాయి గానీ.క్రికెట్ లో అలా కాదు.

 Argued With His Father And Achieved Much ..Spin Bowler Ravi In West Indies T20 Series , Spin Bowler Ravi , Cricket , Ravi Bishnoi , West Indies T20 , Rajasthan Royals -తండ్రితో వాదించి మ‌రీ సాధించాడు.. వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో స్పిన్ బౌల‌ర్ ర‌వి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్క‌డ ఆడితేనే క్రేజ్ అయినా లైఫ్ అయినా.లేదంటే మాత్రం అంతే సంగ‌తి.

అయితే క్రికెట్ లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగిన వారు ఎంద‌రో ఉన్నారు.

ఎంతోమంది చాలా పేద ప‌రిస్థితుల నుంచి వ‌చ్చి.

స్టార్లుగా ఎదిగిన వారు అనేకం ఉన్నారు.ఇప్పుడు కూడా ఓ యువ క్రికెట‌ర్ ఇలాగే వచ్చాడు.

అత‌ను కూడా ఎన్నో అవ‌రోధాల‌ను ఎదుర్కొన్నాడు.పైగా ఇంట్లో వారితోనే వాదించి మ‌రీ అనుకున్న‌ది సాధించాడు.

అత‌నే యువ స్పిన్న‌ర్ రవి బిష్ణోయ్‌.ర‌వి తాజాగా ప్ర‌క‌టించిన వెస్ట్ ఇండీస్ టీ20 సిరీస్‌కు సెల‌క్ట్ అయ్యాడు.

అయితే అత‌ను ఈ స్థాయికి రావ‌డానికి చాలా ఇబ్బందులు ప‌డ్డాడు.క్రికెట్ మీద ఇష్టంతో చ‌దువు మానేసిన‌ప్పుడు తండ్రితో పెద్ద గొడ‌వే జ‌రిగింద‌ని తెలుస్తోంది.

Telugu Cricket, Ravi Bishnoi-Latest News - Telugu

2018లో రవి ఐపీఎల్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున ఆడుతున్నాడు.అయితే అదే స‌మ‌యంలో బోర్డు ఎగ్జామ్స్ ఉండ‌టంతో.క్రికెట్ ఆపేసి ప‌రీక్ష‌లు రాయాల‌ని తండ్రి ఆర్డ‌ర్ వేశాడు.కానీ ర‌వి మాత్రం వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డానికి ఒప్పుకోలేదు.దీంతో తండ్రితో పెద్ద వాద‌నే జ‌రిగింది.చివ‌ర‌కు బోర్డు ఎగ్జామ్ రాయ‌లేదు.

అయినా స‌రే క్రికెట్ మీద ఉన్న న‌మ్మ‌కాన్ని వ‌దులుకోలేదు.ఆ త‌ర్వాత కూడా అత‌ను చాలాసార్లు అండర్-19, అండర్ -16 ట్రయల్స్‌లో రిజెక్ట్ అయ్యాడు.

అయినా స‌రే వెనుదిర‌గ‌కుండా క‌ష్ట‌ప‌డ‌టంతో.తిరిగి అండర్-19 సెలెక్ట్ అయ్యాడు.

అందులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా గెల‌వ‌డంతో.ఇప్పుడు అత‌నికి అవ‌కాశం ద‌క్కింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube