మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు చిరిగిపోయాయా..?! అయితే వాటిని ఇలా మార్చుకోండి..!

సాధారణంగా మనం బ్యాంక్ దాచుకున్న డబ్బులను ఏదో అవసరానికి ఏదో ఒక సమయంలో అత్యవసరంగా తీసుకోవాల్సి వస్తుంది.బ్యాంకుకి వెళ్లి తీసుకోకుండా ఏటీఎంలకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకుంటూ ఉంటాము కొన్నిసార్లు ఏ టైంలో కూడా అప్పుడప్పుడు చిరిగిపోయిన నోట్లు వస్తూ ఉంటాయి.

 Are Your Currency Notes Are Torn Then Exchange Like This-TeluguStop.com

అలాగే ఇంట్లో సామాన్లు కొనడానికి దుకాణాలు వద్దకు వెళ్ళిన అప్పుడు కొన్ని సందర్భాల్లో చిరిగిన నోట్లను కరెన్సీ నోట్లు రావడం మనం చూస్తూ ఉంటాము.అయితే చిరిగిపోయిన నోట్లను బయట వాటిని ఎవరికి ఇచ్చినా తీసుకోకపోవడమే కాక మన అవసరానికి డబ్బులను తీసుకుంటే ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతూ ఉంటాము.

దానికి తోడు చిరిగిపోయిన నోట్లను ఎలా మార్చాలని చాలా అవస్థలు పడుతూ ఉంటాము.అయితే ఇలాంటి కరెన్సీ నోట్లను ఏం చేయాలి.? చిరిగిపోయిన నోట్లను ఎలా మార్చుకోవాలని.? అనే అంశంపై ఆర్బిఐ పలు నిబంధనలు సూచించింది.చినిగిన పాత నోట్లను మార్చుకుని కొత్త నోట్లు పొందవచ్చు అనే అంశాన్ని తెలిపింది.

 Are Your Currency Notes Are Torn Then Exchange Like This-మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు చిరిగిపోయాయా.. అయితే వాటిని ఇలా మార్చుకోండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆర్బీఐ నిబంధనల ప్రకారం.

పొరపాటున చినిగిపోయిన నోట్లు, లేదా కరాబ్ అయిన నోట్లు మీ దగ్గర ఉంటే., వాటిని బ్యాంకుల వద్ద సులభంగా మార్చుకోవచ్చు అని, ఒకవేళ నకిలీ నోట్లు అయితే తప్ప బ్యాంకులు వాటిని తీసుకునేందుకు నిరాకరించకూడదు.

ఏ బ్యాంక్ అయినా చిరిగిన నోట్లను తీసుకోవడానికి వెనకడుగు వేస్తే మనం నేరుగా ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.అలా చేయడం వల్ల బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు ఉంటాయి.

మనం ఎలాంటి ఫారములు నింపాల్సిన అవసరం లేకుండానే చిరిగిన నోట్లను ఏదైనా బ్యాంకులో గాని ఆర్బిఐ కార్యాలయంలో గాని మార్చుకునే వీలుంది.అలాగే కరెన్సీ నోట్లు చిన్న చిన్న ముక్కలు ఉన్నా, చిరిగిపోయిన నోట్ లో ఏదైనా భాగం మిస్సయినా కూడా మనం బ్యాంకుల్లో మార్చుకోవచ్చు.

Telugu Currency Notes, Cutted Notes, Exchange Torn Currency Notes, Indian, Latest News, Reserve Bank Of India, Torn Currency Notes, Updates Latest-Latest News - Telugu

కరెన్సీ నోటుకు ఎక్కడో చిన్న ముక్కలుగా చిరిగితే వాటిని మార్చుకుని పూర్తి మొత్తంలో డబ్బును పొందొచ్చు.అది పూర్తిగా చిరిగిపోకుండా నోట్ లో కొంత భాగం మాత్రమే చిరిగితే మన కరెన్సీ మొత్తం లో పూర్తిగా పొందవచ్చు అని, అదే ఎక్కువ చిరిగితే కొంత శాతాన్ని బ్యాంక్ శాఖకు గాని, లేదా ఆర్బిఐ కార్యాలయానికి గాని చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం.ఒక రూపాయి నుంచి 50 రూపాయల వరకు ఉన్న నోట్ల విషయంలో మాత్రం సగం మొత్తం ఇచ్చే నిబంధన ఏమీ వర్తించదు.

అందువల్ల వీటికి పూర్తి మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉంది.ఒకవేళ కాలిన నోట్లు లేదా పూర్తిగా నలిగి ముక్కలైన కరెన్సీ నోట్లు మాత్రం మార్చుకోవడం కుదరదని ఆర్బీఐ నిబంధనల్లో పేర్కొంది.

అలాంటి కరెన్సీని ఆర్బిఐ ప్రత్యేకంగా జారీచేసే కార్యాలయాలు మాత్రమే డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుందని, అలాగే ఇలాంటి నోట్లతో బ్యాంకులో బిల్లు లేదా పన్నులు చెల్లించుకోవచ్చని ఆర్బీఐ నిబంధనలు పేర్కొంది.

#Notes #Currency Notes #Currency Notes #Indian

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube