ఇంస్టాగ్రామ్ తెగ వాడేస్తున్నారా...?! అయితే ఇది మీ కోసమే...!

ఈ మధ్యకాలంలో ప్రజలకి మొబైల్ లో డేటా వాడకం ఎక్కువవుతున్న నేపథ్యంలో అనేకమంది సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కొనసాగుతున్నారు.ఫేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా అనేక సోషల్ మీడియా మాధ్యమాలలో యూజర్లు తెగ పోస్టుల మీద పోస్ట్ లు చేసేస్తున్నారు.

 Are You Using The Instagram Tribe This Is For You Instagram, Mobile Users, Face-TeluguStop.com

అయితే హ్యాకర్లు మాత్రం ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమలను ఎక్కడి నుండి హ్యాక్ చేస్తారో అర్థం అవ్వట్లేదు.సాధారణంగా ఇలాంటి హ్యాకర్స్ సోషల్ మీడియాలో కొన్ని బగ్స్ ని క్రియేట్ చేస్తుంటారు.

ఇలా వారు క్రియేట్ చేసిన బగ్స్ మీద ఎవరైనా క్లిక్ చేసినట్లయితే వారు సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అది ఎలా అంటే వారు క్రియేట్ చేసిన బగ్స్ వలన యూజర్ యొక్క అకౌంట్ లోకి వారికి ప్రవేశించే విధంగా ఒక లింక్ ఏర్పరచుకుంటారు.

అసలు విషయం ఏమిటంటే… తాజాగా ప్రముఖ సోషల్ వెబ్ సైట్ ఇంస్టాగ్రామ్ లో బగ్ సరికొత్తగా ప్రవేశించినట్లు తెలుస్తోంది.ఇది ఎంతో ప్రమాదకరమని సైబర్ నిపుణులు తెలియజేస్తున్నారు.

ఈ బగ్ కారణంగా హాకర్స్ ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే ఇంస్టాగ్రామ్ లోని ఏ అకౌంట్ కి అయిన సరే… అనుమతి లేకుండా ప్రవేశించవచ్చని, అలా ప్రవేశించడం ద్వారా సదరు వ్యక్తి యొక్క పర్సనల్ మెసేజ్లు చదవడంతో పాటు వారి టైం లైన్ పై ఏదైనా పోస్ట్ చేసుకునే అవకాశం వారికి లభిస్తుంది.

అంతేకాదు యూజర్ యొక్క కెమెరా, లొకేషన్ సమాచారం, వారి కాంటాక్ట్స్, కాల్ లిస్ట్ ఇలా ప్రతి సమాచారాన్ని వారి ఆధ్వర్యంలోకి తీసుకుంటారు.

ఇలాంటివి చేసే సమయంలో ముందుగా హ్యాకర్లు ఓ జేపీజీ ఫార్మాట్లో ఉన్న ఇమేజ్ ను ముందుగా పంపుతారు.ఇలా పంపిన ఇమేజ్ ను ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వారి సిస్టం లోకి బగ్ ఎంట్రీ అయినట్లే.

కాబట్టి ఎవరైనా ఏదైనా తెలియని వ్యక్తి పంపించిన లింకులను క్లిక్ చేయకుండా ఉండమని సైబర్ నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఇదే విషయం సంబంధించి ఇంస్టాగ్రామ్ కు మాతృసంస్థ అయిన ఫేస్ బుక్ ను అప్రమత్తం చేస్తోంది పోలీస్ శాఖ.

ఇందుకు సంబంధించి ఫేస్ బుక్ యాజమాన్యం చర్యలు చేపట్టే క్రమంలో బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube