కొత్తది : టెన్షన్‌ను తగ్గించే కొత్త 'టీ' వచ్చింది మీరు వాడుతున్నారా?

మన జీవితంలో భాగం అయ్యింది టీ.ఉదయం లేవగానే టీ తాగనిదే చాలా మందికి ఏమీ తోచదు.

 Are You Using A New Tea That Reduces-TeluguStop.com

కొందరు అయితే బెడ్‌ టీ లేదా బెడ్‌ కాఫీనే తాగేస్తారు.టీ ఎందుకు తాగుతారు అంటే చాలా మంది ఠక్కున సమాధానం చెప్పలేరు.

టీ తాగేది ఒత్తిడిని తగ్గించేందుకు అని, కాస్త రిలాక్స్‌ అవ్వడానికి అనే విషయం కొందరికే తెలుసు.ఈ విషయాలు తెలియకుండానే చాలా మంది టీ కి బానిస అయ్యారు.

ఆ విషయాన్ని పక్కన పెడితే జపాన్‌ వారు కొత్త టీ ని కనిపెట్టారు.ఈ టీ యొక్క ప్రయోజనాలు అద్బుతం అంటూ వారు తెగ ప్రచారం చేస్తున్నారు.

Telugu Type Tea, Tea, Telugu-General-Telugu

ఒకప్పుడు ‘మాచా’ అనే ఒక చెట్టు ఆకులను ఔషదాల తయారికి ఉపయోగించే వారు.ఇప్పుడు అదే చెట్టు ఆకుల పొడిని టీ పౌడర్‌గా ఉపయోగిస్తున్నారు.మన రెగ్యులర్‌ టీ రుచికి కాస్త భిన్నంగా ఉండటంతో పాటు అచ్చు అదే ప్రాసెస్‌ లో చేసుకునే విధంగా ఉన్న మాచా టీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మెల్ల మెల్లగా విస్తరిస్తుంది.ఇండియాలో కూడా మాచా టీ పౌడర్‌ ఆన్‌లైన్‌ లో లభ్యం అవుతుంది.

కాస్త ఖరీదు ఎక్కువ అయినా కూడా ప్రయోజనం మాత్రం చాలా బాగుందని వాడిన వారు అంటున్నారు.మాచా టీ పౌడర్‌పై దాదాపు అయిదు సంవత్సరాల పాటు జపాన్‌ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు.

Telugu Type Tea, Tea, Telugu-General-Telugu

మొదట ఎలుకపై ఈ టీ పౌడర్‌ను ప్రయోగించారట.ఆ ఎలుక ఎప్పుడైతే మాచా టీ పౌడర్‌ నీటిని తాగిందో అప్పుడే దానిలోని హార్ట్‌ బీట్‌ కాస్త తగ్గడంతో పాటు దాని టెన్షన్‌ కూడా తగ్గినట్లుగా అనిపించింది.మెల్ల మెల్లగా మనుషులపై కూడా దీన్ని ప్రయోగించడం మొదలు పెట్టారు.పలువురిలో బీపీ కంట్రోల్‌కు రావడంతో పాటు టెన్షన్‌ తొలగిపోయి ప్రశాంతత వచ్చినట్లుగా చెబుతున్నారు.దాదాపు 2700 మందిపై ఈ టీ పౌడర్‌ను ప్రయోగించి వారి ఫీలింగ్స్‌ను ఆరోగ్య పరిస్థితిని గురించి విశ్లేషించారు.దాదాపుగా 99 శాతం మంచి ప్రయోజనం కలిగిందని శాస్త్రవేత్తలు గురించారు.

అందుకే మాచా టీ పౌడర్‌ను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు వచ్చారు.జపాన్‌లో అత్యధికంగా అమ్ముడు పోతున్న ఈ టీ ఆ తర్వాత చైనా మరియు అమెరికాల్లో కూడా భారీ అమ్మకాలు జరుపుకుంటుంది.

ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ అమ్మకాలు ప్రారంభం అయ్యాయి.ఈ కామర్స్‌ సైట్స్‌ లో మాచా టీ పౌడర్‌ అందుబాటులో ఉంది.

మరి మీరు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube