నాకు నేర్పిస్తున్నావా? నేను ఎక్కడ పుట్టానో నీకు తెలీదా?

ఈ మధ్య ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా బాగా అలవాటు పడింది.సెలబ్రెటీలు సైతం సోషల్ మీడియాకు బాగా అలవాటు పడుతున్నారు.

 Are You Teaching Me Do You Know Where I Was Born Lavanya Tripathi Reply To Netiz-TeluguStop.com

ప్రతి ఒక్క విషయాన్ని తెగ షేర్ చేసుకుంటున్నారు.ఇక సెలబ్రెటీలు ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని తమ ఫాలోవర్స్ కి పంచుకుంటున్నారు.

కొందరు సెలబ్రెటీలు అప్పుడప్పుడు ఖాళీ సమయం దొరికినప్పుడు తమ ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతూ ఉంటారు.ఇక వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.అలా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ కూడా తన అభిమానులతో కాసేపు ముచ్చట్లు పెట్టింది.ఇంతకీ ఆమె ఎవరో కాదు.

లావణ్య త్రిపాటి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల రాక్షసి గా అడుగు పెట్టి తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను తన వైపు లాక్కుంది.

మిస్ ఉత్తరఖండ్ గా గుర్తింపు పొంది ఆ గుర్తింపుతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి 2008లో అందాల రాక్షసి సినిమాతో పరిచయమైంది.ఈ సినిమాలో తన తొలి నటనతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక హిందీలో, తమిళ భాషలో కూడా పలు సినిమాలలో నటించింది.కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందుకో అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోతుంది.

అవకాశాలు కూడా అంతగా అందుకోలేక పోతుంది.కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

తను ఖాళీగా ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలో తన ఇన్ స్టా ఖాతాలో అడుగు పెట్టి తెగ ఫొటోలు షేర్ చేసుకుంటోంది.ఫన్నీ ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా టూర్స్ ప్లాన్స్ చేస్తూ చిల్ అవుతుంది

అక్కడ దిగిన ఫోటోలను కూడా అభిమానులతో బాగా పంచుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన అభిమానులతో కాసేపు ముచ్చట్లు పెట్టింది.తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఫాలోవర్స్ ను తన గురించి ఏమైనా అడగమని కోరింది.

ఇక అవకాశం వచ్చిందని ఫాలోవర్స్ కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు.తన వాట్సాప్ డీపీ, తన ఫేవరెట్ మూవీని ఇలా ప్రతీదీ అడిగి తెలుసుకున్నారు.

ఇక ఓ నెటిజన్.ఏదైనా హిందీ లో కొన్ని వర్డ్స్ మాట్లాడమని అనడంతో.వెంటనే లావణ్య. నాకు నేర్పిస్తున్నావా? నేను ఎక్కడ పుట్టానో నీకు తెలీదా అంటూ ఫన్నీగా స్పందించింది.ప్రస్తుతం ఆ కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక లావణ్య గత ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఎందుకో ఆ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇక ప్రస్తుతం ఓ సినిమాలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube