బల్లులను చూస్తే భయమా..?! అయితే వాటిని ఇంట్లో నుంచి తరమాలంటే ఇలా చేయండి..!

సాధారణంగా చాలా మందికి బల్లులు అంటే చాలా భయం.అవి ఏదైనా గోడ మీద కనపడితే ఆ వైపు కూడా వెళ్లకుండా అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు.

 Are You Scared To See Lizards But If You Want To Get Rid Of Them From Home, Do T-TeluguStop.com

ఒక్కోసారి వాటిని చూస్తేనే భయంతో ఒళ్ళు జలదరిస్తుంది.ఇలా బల్లులు అంటే భయపడే వారు ఎక్కువగా బల్లులను ఇంట్లో నుంచి తరిమివేయాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి ఒక్కోసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా అలానే ఉంటాయి.ఇంట్లో ఉండకుండా బయటకు తరిమి కొట్టడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.

మరి ఏంటో తెలుసుకుందామా.

ముందుగా యాంటీబ్యాక్టీరియల్ సొల్యూషన్ తో ఇంటి లోపల, గోడలపై , ఫ్లోర్ ను క్రమం తప్పకుండా క్లీన్ చేస్తూ ఉండాలి, అంతేకాకుండా ఎల్లప్పుడు కిటుకులు, ఇంట్లోనే మూలలు శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి.

అలాగే బల్పులు ఉన్న ప్రాంతానికి బల్లులు రావడానికి భయపడతాయి.అసలుకి ఆ ప్రాంతం వైపు రావు.ఇంటి గోడల పై చిన్న చిన్న పురుగుల కోసం తరచుగా వచ్చి వాటిని తినేందుకు తెగ ప్రయత్నాలు చేస్తాయి.దీనికి మనం కాఫీ, టొమాకో పౌడర్‌ ని నీటితో కలిపి ఒక ముద్ద చేసి ఆ ముద్దను గోడలపై అతికిస్తే బల్లులు రావు.

నెమలి ఈకల ను చూస్తే కూడా భయపడి పోయి వాటి దగ్గరకు రావు.అలాగే బల్లులు ఎక్కువగా వెలుతురుకు ఆకర్షితమవుతాయి.

అందుకే వీలైనప్పుడల్లా బల్పులను ఆఫ్ చేస్తే బల్లులు పెద్దగా ఇంట్లోకి రావు.అలాగే గుడ్ల పొట్టుతో కానీ, ఉల్లి రసాన్ని గోడలపై స్ప్రే ద్వారా  కానీ, నాఫ్తలీన్ బాల్స్ ను అక్కడ అక్కడ ఉంచిన కానీ బల్లులు పారిపోతాయి.

అంతేకాకుండా బిర్యాని ఆకులను మన్నించి ఆ పొగను మొత్తం ఇంటిలో ఒకసారి వ్యాపించే లాగా చేసినా కూడా ఆ వాసనకు బల్లులు ఉండకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి.మీరు కూడా ఈ చిట్కాలను పాటించి ఒకసారి ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube