కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉందన్న ఆయన తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని తెలిపారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎంనే విడిచిపెట్టలేదన్న అనురాగ్ ఠాకూర్ కవితను ఎలా విడిచిపెడతామని అన్నారు.అదేవిధంగా తెలంగాణలోని కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్ అని పేర్కొన్నారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.పరివార్ సర్వీస్ కమిషన్ అంటూ ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ గత మ్యానిఫెస్టోపై చర్చకు కేసీఆర్ సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒకటి కాదని స్పష్టం చేశారు.