తులసి మొక్కను అక్కడ పెడుతున్నారా... నిందల పాలవుతారు జాగ్రత్త..!

తులసి మొక్క మన హిందూ సంప్రదాయాలలో ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు.దాదాపు ప్రతి ఇంటి ఆవరణంలో విశేష పూజలు అందుకునే మొక్కలలో తులసి మొక్క ముందు వరుసలో ఉంటుంది.

 Are You Putting A Basil Plant There Beware Of Blame-TeluguStop.com

దేవత వృక్షాలలో ఎంతో పవిత్రమైన మొక్కగా తులసిని భావిస్తారు.అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కకు అంతే ప్రాధాన్యత ఉంది.

తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.అందుకే కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో తులసికి చాలా ప్రాధాన్యత ఇస్తారు.

 Are You Putting A Basil Plant There Beware Of Blame-తులసి మొక్కను అక్కడ పెడుతున్నారా… నిందల పాలవుతారు జాగ్రత్త..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతటి పవిత్రమైన తులసి మొక్కను మన ఇంటి ఆవరణంలో పెంచుకొని పూజ చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయని పెద్దఎత్తున భక్తులు విశ్వసిస్తుంటారు.అయితే మన ఇంటిలో తులసి మొక్కలను పెంచుకునే విధానం.

ఏ దిశలో పెట్టాలో.ఎక్కడ పెట్టకూడదో అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా తులసిలో రెండు జాతులున్నాయి.

ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అని, లేత రంగులో ఉండేదానిని రామతులసి అని పిలుస్తారు.ఇంతటి పవిత్రమైన ఈ తులసి మొక్కను ఆ దేవతలకు ప్రతిరూపంగా భావిస్తారు.

తులసి మొక్కను నాటే విధానంలో, పూజలు చేసే విధానంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు.ముఖ్యంగా తులసిని పొరపాటున మన ఇంటి పైకప్పు భాగాన పెడితే ఆ కుటుంబంలోని సభ్యులు ఎక్కువగా నిందల పాలవుతారు.

పొరపాటున కూడా ఇంటి కప్పు పై తులసి మొక్కను పెట్టి పూజలు చేయకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Telugu Basil Plant, Blames, Dark Basil, Hindu Traditions, Pooja, Roof Top, South Facing, Tulasi, Vasthu Sastra Professionals-Telugu Bhakthi

తులసి మొక్కను ఇంటి పైకప్పు మాత్రమే కాకుండా, ఇంటి ఆవరణంలో దక్షిణ దిశ వైపు పెంచకూడదు.పొరపాటున దక్షిణ దిశ వైపు ఉంచిన వెంటనే తులసి మొక్కను అక్కడ నుంచి తీసేయాలి.దక్షిణదిశలో తులసి మొక్క ఉంటే ఆ ఇంటిలో నివసించే కుటుంబ సభ్యులకు మానసిక ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మొదలవుతాయి.

అందుకే తులసి మొక్కను దక్షిణ దిశలో పెంచకూడదు.తులసి మొక్కను ఎల్లప్పుడు ఇంటికి ఉత్తరాన, ఈశాన్య దిక్కున, తూర్పు దిశలో నాటాలి.ఈ విధంగా తులసి మొక్కను నాటి పూజలు చేయటం వల్ల ఆ ఇంట్లో సకల సంపదలు, అష్టైశ్వర్యాలతో సంతోషంగా గడుపుతారు.తులసిని పెంచేటప్పుడు ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

#Roof Top #South Facing #Blames #VasthuSastra #Dark Basil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU