ప్రయాణం అంటే కేవలం ఆనందించడమే కాదు, కొత్త వ్యక్తులను కలవడం, విభిన్న సంస్కృతులను అన్వేషించడం, కొత్త జీవన విధానాలను తెలుసుకోవడం అనేది చాలామంది నమ్మకం.కొత్త దేశాన్ని సందర్శించినప్పుడు, సొంత ఇంటి నియమాలు, ఆచారాలు అక్కడ చాలా భిన్నంగా ఉంటాయని మనం గమనించవచ్చు.
ఉదాహరణకు, ఇన్‌స్టాగ్రామ్‌లో @theturbantraveller అనే ఇండియన్ ట్రావెలర్ తన యూరోప్ పర్యటన (Europe trip)నుంచి ఒక ఆసక్తికరమైన “టాయిలెట్ టిప్”(toilet tip) పంచుకున్నారు.తన వీడియోలో, ఎస్టోనియా రాజధాని తాల్లిన్‌లో తన అనుభవాన్ని వివరించారు.
ఆ నగరం చాలా అందంగా ఉన్నప్పటికీ, తన భార్యతో కలిసి పబ్లిక్ టాయిలెట్లు కనుగొనడం చాలా కష్టమని ఆయన చెప్పారు.
ఇండియాలో ఎక్కడైనా రెస్టారెంట్‌కి వెళ్తే, అక్కడ టాయిలెట్ ఉంటుంది కదా అని ఆ భార్యాభర్తలు అనుకున్నారు.
అందుకే మెక్‌డొనాల్డ్స్‌కి(McDonald) వెళ్లి, అక్కడ టాయిలెట్ ఉపయోగించాలని అనుకున్నారు.కానీ వారికి కొత్త షాక్ తగిలింది.
అక్కడ టాయిలెట్‌ని ఉపయోగించాలంటే, కచ్చితంగా అక్కడ ఏదైనా తినాలి లేదా తాగాలి.అంటే, బిల్లు లేదా టిప్‌గా చెల్లించాలి.“ఇక్కడ యూరప్‌లో ప్రతిదానికీ డబ్బు చెల్లించాలి” అని ఆ ట్రావెలర్ వెల్లడించారు.
అక్కడ టాయిలెట్‌ని ఉపయోగించాలంటే, వారు తినే ఆహారం బిల్లుపై ఒక కోడ్ ఉంటుంది.ఆ కోడ్‌ని ఉపయోగించి మాత్రమే టాయిలెట్‌కి వెళ్లాలి.ఆ ట్రావెలర్‌కి ఈ విధానం కొత్తగా అనిపించినప్పటికీ, చాలా తెలివైనదని అన్నారు.
ఆయన భార్య మాత్రం ఆ టాయిలెట్ ఎంత శుభ్రంగా ఉందో చెప్పి ఆశ్చర్యపోయారు.
ఆ ట్రావెలర్ తన వీడియో క్యాప్షన్‌లో, ‘యూరప్‌లో టాయిలెట్లు(Europe toilet) కనుగొనడంలో నా అనుభవాలు మీకూ ఉపయోగపడతాయి’ అని రాశాడు.ఆయన వీడియో చాలా మందికి నచ్చింది.కొంతమంది వీడియో చూసిన వారు, ‘మనం ఎవరినైనా బిల్లు కోడ్‌ని ఉపయోగించవచ్చా?’ అని అడిగారు.మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు.ఒకరు ఫిన్లాండ్‌లో కూడా అదే నియమం ఉందని చెప్పారు, మరొకరు పోర్చుగల్‌లో టాయిలెట్లు ఉచితంగా ఉంటాయని చెప్పారు.ఒక యూజర్, ‘టాయిలెట్లకు డబ్బు చెల్లించడం మంచి ఆలోచనే, ఎందుకంటే ఉచిత టాయిలెట్లు చాలా అపరిశుభ్రంగా ఉంటాయి’ అని కామెంట్ చేశారు.