హార్థిక్ పాండ్యాపై అతి విశ్వాసమేనా..?!

ఐపిఎల్ సందడి ఉండంగానే టీ20 హడావుడి మొదలైంది.టీ20 వరల్డ్ కప్ మరోకొన్ని రోజుల్లో మొదలుకానుంది.ఐపిఎల్ అయిపోయే రెండు రోజుల తర్వాత టీ20 వరల్డ్ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.ఈపాటికే టీ20 టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.అక్టోబర్ 10వ తేది వరకూ మార్పులు చేసేందుకు టైమ్ ఉంది.అయితే అంతలోపు కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉండొచ్చు.

 Overconfident About Hearthik Pandya  Hardik Pandey, Sports Update, Ipl, Trust, L-TeluguStop.com

ఐపిఎల్ లో టీమిండియా దూకుడుగా ఆడి ఈసారి కప్ సాధించాలనే ఉత్సాహంతో ఉంది.కొందరు ఆటగాళ్లు మాత్రం ఐపిఎల్ లో పేలవమైన ప్రదర్శన కనబరుస్తూ ఉన్నారు.

ఆ వరుసలో ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్యాలు ఉన్నారు.కొన్ని రోజుల పాటు వీరిపై వేటు తప్పదని అందరూ భావిస్తున్నారు.

అయితే ఇందులో ఎవరు ఉంటారో, ఎవరు ఉండరో తెలియాల్సి ఉంది.ఆల్‌రౌండర్‌ అయిన హార్దిక్‌ పాండ్యాను టీమ్ నుంచి తొలగించేందుకు సెలక్టర్లు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.

హర్దిక్‌ పాండ్యాపై సెలక్టర్లకు నమ్మకం ఉందని, అందుకే టీమ్ లో పాండ్యాను కొనసాగించవచ్చని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుత.అసలు విషయం తెలిపాడు.హార్దిక్‌ పాండ్యా స్థానంలో ఇంకొకరిని తీసుకోలేమని తెలిపారు.

పాండ్యా ఆటతీరు బాగుంటుందని, అందుకే అతని ఆటతీరుపై అందరికీ నమ్మకం ఉందని తెలిపారు.ఐపిఎల్ లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా ఫామ్‌లోకి వచ్చి మంచి ప్రదర్శన కనబరిచాడు.

Telugu Hardik Pandey, Latest-Latest News - Telugu

ముంబై విజయంలో హార్దిక్‌ ముఖ్య భూమిక పోషించాడు.30 బాల్స్ కు 40 రన్స్ చేశాడు.అయితే ఐపీఎల్‌ లో బ్యాటింగ్‌ కు మాత్రమే చేయగలిగాడు.హార్దిక్‌ బౌలింగ్‌ మాత్రం అంతగా చేయలేకపోయాడు.అందుకే ఆల్‌రౌండర్‌ కోటాలోనే హార్దిక్‌ జట్టులోకి ఎంపిక అయ్యాడని చెప్పొచ్చు.ప్రస్తుతం ఇదే దూకుడుతో పాండ్యా తన సత్తా చాటుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube