పీపీఎఫ్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. ముందుగా ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..

ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని అందించే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) పైవరుసలో ఉంటుంది.పీపీఎఫ్‌ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మూడు, ఆరవ ఆర్థిక సంవత్సరాల్లో పీఎఫ్ నుంచి రుణాలు పొందవచ్చు.

 Are You Investing In Ppf  Know These Important Things First , Ppf, Amount, Late-TeluguStop.com

ఏడు ఏళ్ల తర్వాత పాక్షికంగా (50 శాతం వరకు) నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.విద్యా లేదా అనారోగ్యాలను కారణంగా చూపి ఐదేళ్ల తరువాత పీపీఎఫ్‌ అకౌంట్ క్లోజ్ చేయవచ్చు.

పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వ హామీ ఉంటుంది.అలాగే రాబడి అనేది ఖచ్చితంగా ఇన్వెస్టర్లకు అందుతుంది.

ఈ పథకంలో పెట్టుబడిదారులు ఏడాదికి లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టొచ్చు.అయితే అకౌంట్ నిర్వహణ కోసం సంవత్సరానికి కనీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఈ పథకం ద్వారా సంపాదించిన వడ్డీపై, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు.

Telugu Amount, Latest-Latest News - Telugu

అయితే ఈ పథకం అనేది 15 సంవత్సరాల కాలపరిమితితో వస్తుంది.అందుకే 15 ఏళ్ల వరకు పెట్టుబడిదారులు పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి వీలు పడదు.ఐదేళ్లపాటు పెట్టుబడులు పెట్టిన తర్వాత మిగతా కాలంలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఖాతాను 15 ఏళ్ల వరకు కొనసాగించవచ్చు.కాలపరిమితి తీరిన తర్వాత ఖాతాను క్లోజ్ చేయవచ్చు.

ఇందుకు గాను మీరు ఫామ్-సీ ఫారంను నింపి పోస్ట్ ఆఫీస్ లేదా పీఎఫ్ ఖాతా ఉన్న బ్యాంకు కి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.ఒకవేళ ఇష్టముంటే మెచ్యూరిటీ పీరియడ్ దాటిన తర్వాత కూడా పీఎఫ్ ఖాతాను కొనసాగించవచ్చు.

మెచ్యూరిటీ పీరియడ్ దాటిన తర్వాత కూడా పెట్టుబడి మొత్తం పై వడ్డీ అందుతుంది.

ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన డబ్బు పై ఎలాంటి పన్ను భారం ఉండదు.

మీ పీఎఫ్ లో పెట్టిన పెట్టుబడిలో 25 శాతం వరకు రుణం పొందవచ్చు.అయితే మీకు ఈ పెట్టుబడిపై లభించే వడ్డీ రేటుకు లోను  వడ్డీ రేటు అనేది 2 శాతం అధికంగా ఉంటుంది.

ఈ రుణాన్ని మీరు మూడేళ్ల లోపు చెల్లించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube