సాధారణంగా చాలా మంది ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవిని పూజిస్తే పెద్దఎత్తున అమ్మవారికి పూజలు చేస్తారు.ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం నిద్ర లేచి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని పూజగదిని, పూజాసామాగ్రిని శుభ్రం చేసుకొని పూజ చేస్తుంటారు.
ఇలా శుక్రవారం అమ్మవారిని పూజించండం వల్ల అమ్మవారి కరుణాకటాక్షాలు మనపై కలిగి మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతుందని భావిస్తారు.అయితే శుక్రవారం అమ్మవారికి పూజలు చేసినప్పటికీ పొరపాటున కూడా శుక్రవారం పూజ గదిని పూజా సామాగ్రి శుభ్రం చేయకూడదని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా శుక్రవారం పూజ గదిని లేదా పూజ సామాగ్రిని శుభ్రం చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం లభించదని పండితులు తెలియజేస్తున్నారు.ధనానికి అధిపతి కుబేరుడు .కుబేరుడు అనుగ్రహం లేనిదే లక్ష్మి అనుగ్రహం కలగదని అందుకోసమే కుబేరుడి అనుగ్రహం మనపై ఉండాలంటే శుక్రవారం పూజ గదిని శుభ్రం చేయకూడదని పండితులు చెబుతున్నారు.అందుకే శుక్రవారం కాకుండా శని ఆది లేదా గురు వారాలలో పూజ గదిని పూజ సామాగ్రిని శుభ్రం చేసుకోవడం ఎంతో ఉత్తమం.

ఆదివారం పూజ గదిని పూజా సామాగ్రిని శుభ్రం చేయడం వల్ల కంటికి సంబంధించిన దోషాలు తొలగిపోయి కంటి చూపు మెరుగుపడుతుంది.గురువారం పూజ గదిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల గరుడు అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.అలాగే శనివారం పూజ గది శుభ్రం చేసి పూజ చేయటం వల్ల వాహన ప్రమాదాలు తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు.ఇలా శని ఆది గురువారాల్లో మాత్రమే పూజగదిని శుభ్రం చేయాలని శుక్రవారం పొరపాటున కూడా పూజగదిని శుభ్రం చేయకూడదు.
BREAKING/FEATURED NEWS SLIDE