భారతదేశంలో మొబైల్ ప్రపంచంలో అనేక మార్పులకు గురి చేసిన సంస్థగా ఎంఐ పేరు తెచ్చుకుంది.తక్కువ ధరకే ఎన్నో స్పెసిఫికేషన్లను అందిస్తుంది చైనా దేశానికి చెందిన సంస్థ.
ఇదివరకు చైనా మొబైల్స్ అంటే ఇలా ఉపయోగించి అలా పడేసే ఒక నమ్మకం ఉంది.కాకపోతే, ఈ ఎంఐ సంస్థకు చెందిన ఫోన్ లు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
అందరికీ బడ్జెట్ లో ఉండే విధంగా అనేక స్పెసిఫికేషన్లను విడుదల చేస్తూ కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చి భారతదేశంలో అతిపెద్ద మొబైల్ మార్కెటింగ్ ను సంపాదించుకుంది.
ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే.
మరోవైపు మాత్రం ఈ సంస్థకు చెందిన యాక్సెసరీస్ డూప్లికేట్ బయట చలామణిలో ఉన్నాయి.ఏంటి ఇలా అని అనుకుంటున్నారా.
అవును నిజమే ఎంఐ సంస్థకు చెందిన ప్రొడక్ట్స్ కొన్ని వేల సంఖ్యలో డూప్లికేట్స్ చలామణిలో ఉన్నాయి.ప్రజల డూప్లికేట్ ఉత్పత్తులకు సంబంధించి పోలీసులు పెద్ద ఎత్తున వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా చెన్నై, బెంగుళూరు నగరాల్లో నిర్వహించిన పోలీసులు ఏకంగా 33 లక్షల పైగా విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.ఈ క్రమంలో భాగంగా చెన్నైలో నలుగురు బెంగళూరులో ముగ్గురిని ఉత్పత్తి చేసే వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు సమాచారం ఇచ్చారు.
పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొబైల్ బ్యాక్ కేసులు, అలాగే హెడ్ ఫోన్స్, పవర్ బ్యాంకులు, ఛార్జర్లు అలాగే ఇయర్ ఫోన్స్ తో కూడిన మూడు వేలకు పైగా ఉత్పత్తులను రైడ్ లో సీజ్ చేశారు.
ఇందుకు సంబంధించి ఎంఐ సంస్థ తన ఆపరేషన్ నకిలీ నిరోధక కార్యక్రమంలో ఓ భాగమని కంపెనీ తెలిపింది.ఇందులో భాగంగానే బెంగళూరు నగరంలో 24.9 లక్షలు, అలాగే చెన్నై నగరంలో 8.4 లక్షల విలువైన నకిలీ ఉత్పత్తులను విక్రయించేందుకు రెడీగా ఉన్న సమయంలో వాటిని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇదివరకు ఎంఐ సంస్థ ప్రతినిధులు నకిలీ నిరోధక కార్యక్రమంలో భాగంగా కంప్లైంట్ చేయడంతో అక్టోబర్, నవంబర్ నెలల్లో మార్కెట్లో దాడులు చేయగా ఆ తర్వాత కేసులను రిజిస్టర్ చేశారు.దాంతో పోలీసు అధికారులు కంపెనీ ప్రతినిధులు కలిసి మూడు ప్రముఖ దుకాణాల నుంచి ఈ నకలి పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.