మీరు విడిపోతున్నారా లేదా.. అమీర్ ఖాన్ దంపతులకు ప్రశ్నలు!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పేరు ఈమధ్య వార్తల్లో బాగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.ఇటీవలే తన రెండో భార్య కిరణ్ రావుకి విడాకులు ఇచ్చినట్లు అందరి ముందు తెలిపాడు అమీర్ ఖాన్.

 Are You Breaking Up Are Not Aamir Khan Couple Question Aamir Khan, Kiran Rao, Se-TeluguStop.com

ఇక ఈ విషయం బాలీవుడ్ లో తెగ వైరల్ గా మారింది.అమీర్ ఖాన్ తన భార్యకు విడాకులు ఇచ్చినందుకు పలురకాల విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు.

అంతేకాకుండా తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం కూడా మరో సినీ నటితో ప్రేమాయణం చేస్తున్నట్లు అని వార్తలు కూడా వినిపించాయి.

ఈయనకి 2005లో కిరణ్ రావు తో రెండో పెళ్లి జరుగగా అంతకుముందే 1986లో రీనా దత్త ను పెళ్లి చేసుకున్నాడు.

ఆ తర్వాత కొన్ని మనస్పర్థలతో 2002లో ఆమెకు విడాకులు ఇచ్చాడు.ఇక కిరణ్ రావుకు కూడా విడాకులు ఇవ్వగా ఇక తమ మధ్య ఎటువంటి పెళ్లి బంధం ఉండదని క్లారిటీ ఇచ్చాడు.

దీంతో ఇండస్ట్రీకి చెందిన వాళ్లు మొత్తం ఇలాగే ఉంటారని జనాలు కూడా ఈ విషయాన్ని వదిలేశారు.కానీ మళ్లీ వీరిద్దరు ఒకే చోట ఉండటంతో తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Telugu Aamir Khan, Bollywood, Divorced, Kiran Rao, Marrige-Movie

ప్రస్తుతం అమీర్ ఖాన్ లాల్ చద్దా అనే సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక తాజాగా అమీర్ ఖాన్ లాల్ చద్దా సినిమా టీమ్ తో పాటు తన మాజీ భార్య కిరణ్ రావు, అతని కొడుకు ఆజాద్ తో కలిసి టెన్నిస్ ఆడుతూ కనిపించారు.ఇక దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారగా.

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Aamir Khan, Bollywood, Divorced, Kiran Rao, Marrige-Movie

విడిపోయిన తర్వాత కూడా మళ్లీ కలిసి కనపడుతున్నారని అంటున్నారు.అంతేకాకుండా నిజంగా మీరు విడిపోతున్నారా లేదా అని అమీర్ ఖాన్ దంపతులపై తెగ ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.ఇక కొందరు ఇవన్నీ వీళ్లకు కామన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube