మీకు తెలియని వారి వాట్సాప్ గ్రూపులో యాడ్ చేస్తున్నారా..?! అయితే వాటి నుంచి బయటపడాలంటే ఇవి చేయాల్సిందే..!

ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు వాట్సాప్ ను ఉపయోగించడం సర్వసాధారణం అయిపోయింది.ఈ తరుణంలో వాట్సాప్ యూజర్స్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటి అంటే ఎవరు పడితే వారు వాట్సప్ గ్రూపులలో ఎటువంటి పర్మిషన్ లేకుండా యాడ్ చేసేస్తున్నారు ఈ క్రమంలో ఒక్కోసారి ఏదైనా వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయాలంటే వందలకొద్దీ మెసేజస్ వస్తూ ఉంటాయి.

 Are You Adding In The Whatsapp Group Of People You Don't Know  But In Order To G-TeluguStop.com

దీంతో కొంతమందికి ఇది కాస్త భారంగా మారింది.ఎవరు పడితే వారు వాట్సప్ గ్రూపులలో యాడ్ చేయకుండా ఉండేయందు కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే సరి.అలాగే ఎటువంటి పర్మిషన్ లేకుండా కనీసం ఎటువంటి సమాచారం అంద చేయకుండా గ్రూప్ లో యాడ్ చేయడం కనీసం ఆ గ్రూపులో నుంచి ఎగ్జిట్ అవ్వడానికి కూడా సాధ్యపడుతుంది.ఈ సమస్య నుంచి బయటపడాలంటే మీ వాట్సాప్ లో సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకుందామా.

ముందుగా మీ మొబైల్ ఫోన్ లో వాట్సాప్ యాప్ ను  ఓపెన్ చేసి కుడివైపు కార్నర్ లో 3 డాట్స్ పై  క్లిక్ చేయాలి.ఇందులో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది.

ఆ తర్వాత అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయగా ప్రైవసీ అనే ఆప్షన్ లో గ్రూప్  పై క్లిక్ చేయాలి.అనంతరం ఇందులో Everyone, My contacts, My contacts except, nobody except my contacts ఆప్షన్స్ కనపడతాయి.

  Everyone అని క్లిక్ చేస్తే మనల్ని ఎవరైనా సరే వివిధ గ్రూపులలో  యాడ్  చేసుకోవచ్చు అదే My contacts పై క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారు మాత్రమే గ్రూపులో యాడ్ చేసుకోవడానికి పాజిబుల్ ఉంటుంది.అదే My contacts except ఆప్షన్ ను  సెలెక్ట్ చేసుకుంటే మీ కాంటాక్ట్ లో కొంతమంది మాత్రమే గ్రూపులో యాడ్ చేయకుండా చేసుకోవచ్చు.

అదే nobody అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఎవరు కూడా మిమ్మల్ని ఏ గ్రూపులో యాడ్  చేసుకోవడానికి వీలు పడదు.ఒకవేళ మీకు తెలియకుండా ఏదైనా గ్రూపులో యాడ్ చేయాలి అని అనుకున్నా కానీ మీకు ఒక గ్రూప్ ఇన్విటేషన్ లింక్ వస్తుంది.

ఆ లింక్ ను యాక్సెప్ట్ చేస్తేనే గ్రూపుల్లో యాడ్ అవ్వచ్చు.లేకపోతే లేదు.మీరు ఎవరైనా ఏదైనా గ్రూపులో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ గ్రూప్ అడ్మిన్ కు మీ నెంబర్ యద  చేయమని చెప్పినా కూడా మీకు ఒక గ్రూప్ ఇన్విటేషన్ లింక్ వస్తుంది.వెంటనే ఆ లింక్ ను ఆక్సిప్టు చేస్తే మీరు ఆ గ్రూపులో కి యాడ్ అవ్వచ్చు.

ఈ  ఇన్విటేషన్ లింక్ మూడు రోజులపాటు యాక్టివ్ లో ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిన్న సెట్టింగ్స్ మార్చుకొని వివిధ గ్రూపులలో యాడ్ అవ్వకుండా జాగ్రత్త పడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube