వైరల్ వీడియో నువ్వా.. నేనా..? అన్నట్లుగా రెచ్చిపోతున్న చేపలు..!

చేపలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సముద్ర గర్భంలో రెండు చేపలు ఒక దానితో ఒకటి గొడవపడుతున్నాయి.

 Are You A Viral Video  Nena  Exciting As Ever Viral Video, Viral Latest, Fishes,-TeluguStop.com

సముద్రపు నీటి కోసం దేశాలు, రాష్ట్రాలు కొట్టుకోవడం చూశాం కానీ ఇలా చేపలు నీటిలో గొడవ పడటం ఇప్పుడే చూస్తున్నామని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోలో రెండు చేపలు ఒకదానిపై ఒకటి తమ నోటితో సముద్రంలోని మట్టిని పోసుకుంటున్నారు.

అవి దేనికోసమో గొడవ పడుతున్నట్లు ఈ వీడియో ద్వారా అర్థం అవుతోంది.

సాధారణంగా చేపలు మంచి నీటిలో, ఉప్పు నీటిలో జీవిస్తుంటాయి.చేపల్లో సుమారు 25,000 జాతులు ఉన్నాయి.

చేపలను వాటి శ్వాసవయవాల అమరికను బట్టి ఊపిరితిత్తుల చేపలు, మొప్పల చేపలు అని రెండు రకాలుగా విభజించారు.చేపలను వాటి ఆహారపు అలవాటును బట్టి సర్వభక్షక చేపలు, శాకాహారపు చేపలు, మాంసాహారపు చేపలుగా గుర్తించ వచ్చు.

చేపలను నివసించే చోటును బట్టి మంచి నీటి చేపలు, ఉప్పునీటి చేపలు అని చెప్పవచ్చు.చేపల్లో అతి చిన్నది 0.25 సెంటి.మీ పొడవు ఉంటుంది.

అదే పెద్ద చేప అయితే 2మీ.కంటే ఎక్కువ పొడవుగా ఉంటాయి.

చేపల్లో డయోడాన్ అనే చేప అత్యంత విషపూరితమైన చేప.ఈ చేప సముద్ర జలాలలోనే నివసిస్తుంది. చేపలను మనుషులు ఆహారంగా తీసుకుంటుంటారు.చేపల్లో విటమిన్ ఏ, డీ, ఈ, కే లు ఉంటాయి.చేపలను నదులు, సముద్రాలు, కాలువలు, సరస్సులలో పట్టడంతో పాటు వాటి పిల్లలను ఉత్పత్తి చేసి, కృత్రిమంగా, శాస్త్రీయ పద్ధతుల్లో పెంచుతుంటారు.

ప్రాచీనకాలం నుండి మానవులకు, కొన్ని జంతువులకు చేపలు ఒక ముఖ్యమైన ఆహారంగా ఉంటున్నాయి.

చేపలు రుచిగా ఉండటంతో పాటు తేలికగా జీర్ణమవుతాయి.రోజూ చేపలు తినటం వల్ల మధ్య వయసు దాటిన మగవారికి ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అప్పుడప్పుడు మాత్రమే చేపలు తినే వారితో పోలిస్తే రోజూ చేపలు తినే వారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారకాలు తక్కువగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube