మీరు కంటెంట్ క్రియేటర్లా..?! అయితే డబ్బులు సంపాదించుకోవడం ఎలానో చూడండి..!

ఇంట్లో ఉండి సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకునే వారి కోసం ఒక మంచి శుభవార్త.మీరు కంటెంట్ క్రియేటర్లు అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 Are You A Content Creator Look At How To Make Money,content Creator, Money Earni-TeluguStop.com

అది ఎలా అంటే ప్రముఖ ఫేస్ బుక్ సంస్థ క్రియేటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎనేబుల్మెంట్ ప్రొగ్రామ్ ను మన ముందుకు తెచ్చింది.క్రెయేటర్ డే ఇండియా ఈవెంట్ ను పురస్కరించుకొని ఫేస్ బుక్ ఈ కొత్త ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టింది.

అంతేకాకుండా ఈ కొత్త ఆన్లైన్ కోర్సు కేవలం ఫేస్బుక్ ప్లాట్ ఫాంలో మాత్రమే కాకుండా ఫొటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ లో కూడా మనకు అందుబాటులో ఉండనుంది.

అంతకుముందు ఇంస్టాగ్రామ్ ప్రవేశపెట్టిన బోర్న్ ఆన్ ఇంస్టాగ్రామ్ ప్రోగ్రామ్ తర్వాత దశగా క్రెయేటర్ ఎడ్యుకేషన్ కొనసాగనుంది.

నిజానికి ఈ ప్రొగ్రామ్ 2019లోనే ప్రవేశపెట్టారు.కానీ అప్పుడు మనకి అందుబాటులో లేదు.

కాగా ఇప్పుడు ఈ ప్రొగ్రామ్ భారతీయ కంటెంట్ క్రియేటర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది.ఈ-క్రెయేటర్ లెర్నింగ్ కోర్సు నేర్చుకోవడం ద్వారా కంటెంట్ క్రియేటర్లు స్వయంగా డబ్బులు సంపాదించుకోనే అవకాశం ఉంటుంది.

అలాగే ఈ కోర్సు పూర్తి అయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తారు.ఈ కోర్సులో ప్రధానంగా వేటి గురించి డిస్కస్ చేస్తారంటే మార్కెట్‌ ధోరణి, ప్రొడక్టులకు సంబందించిన అప్ డేట్స్, సవాళ్ల గురించి మంచి అనుభవం గల టీచర్లతో నేర్పిస్తారు.

Telugu Program, Latest-General-Telugu

ఇలా క్రియేటర్లు లోక జ్ఞానం పెంచుకోవడంతో పాటు, ఆదాయం కూడా సంపాదించుకోవడానికి ఈ కోర్సు ఎంతోగానో సహాయ పడుతుంది అని ఇన్‌స్ట్రాగామ్‌ హెడ్‌ అడమ్‌ మోసెరీ తెలిపారు.అంతేకాకుండా ఈ కాలంలో ఇన్‌స్ట్రాగామ్‌ షార్ట్‌ వీడియో ఫీచర్‌ రీల్స్‌ ద్వారా ప్రతి ఒక్కరు రీల్స్ క్రెయేట్ చేస్తున్నారని, సగటున ప్రతిరోజు 60 లక్షల రీల్స్‌ క్రియేట్ అవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే ఇన్ స్ట్రీమ్ యాడ్స్ ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తున్నారని వివరించారు.అందుకే డబ్బులు సంపాదించుకోవాలని అని అనుకునే కంటెంట్ క్రియేటర్ల కోసం పెయిడ్ ఆన్ లైన్ టూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్ బుక్.

మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరిన్ని డబ్బులు సంపాదించుకొండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube