ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood ) నిండా రైటర్లు ( Writers ) ఉండేవాళ్ళు.వాళ్లు కథలను అందిస్తే దర్శకులు సినిమాలు చేసేవారు.
అందువల్ల సినిమాల్లో క్వాలిటీ అనేది ఎక్కువగా ఉండేది.ఇక ఆ తర్వాత రైటర్లు దర్శకులుగా మారి సినిమాలు చేస్తున్నారు.
వీళ్ళు ఒకటి రెండు సినిమాలు చాలా క్వాలిటీగా చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం మిగిలిన సినిమాలను చేయడంలో క్వాలిటీ మిస్ అవుతుంది.
అందువల్లే చాలా మంది దర్శకులు( Directors ) నాసిరకమైన కథలతో సినిమాలను చేస్తూ డిజాస్టర్లను మూట గట్టుకుంటున్నారు.
ఇక ఒక కథ రచయిత యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే సుదీర్ఘంగా కథ మీద చర్చలు జరిపి సినిమాని చాలా గొప్ప గా మల్చడంలో ఒక మంచి కథని అందిస్తారు.ఇక ఇలాంటి క్రమం లో వాళ్ళు ఆ కథ మీద చాలావరకు కూర్చుంటారు.
కాబట్టి వాళ్లకి ఆ స్టోరీని ఎలా చేస్తే బాగుంటుందనే అవగాహన ఉంటుంది.
దర్శకుడు అంటే ఆయన సవాలక్ష పనులు ఉంటాయి కాబట్టి ఇటు కథ రాసుకొని అటు సినిమా చేయడం అంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కాబట్టి ఎప్పుడైనా కథ రాయడానికి ఒక సపరేట్ కథ రచయిత( Story Writer ) ఉంటే మంచిదని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.మరి కొంతమంది మాత్రం కథ రచయిత దర్శకత్వం వహిస్తే సినిమా చాలా బాగా వస్తుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు.
ఇక మొత్తానికైతే ఇప్పుడు ఇండస్ట్రీలో కథా రచయితలు అనేవారు ఎవరు లేరు.ఎవరు కథ అయితే రాసుకుంటున్నారో వాళ్ళే సినిమా డైరెక్ట్ చేస్తున్నారు…ఇక ప్రస్తుతం ఇక చేయడం వల్ల కొంతమంది సూపర్ సక్సెస్ అవుతుంటే మరి కొందరు మాత్రం తీసిన కథలనే మళ్ళీ తీస్తూ సినిమాలను ప్లాప్ చేస్తున్నారు.ఇక ఇప్పటికైన కథలు రాసే సామర్థ్యం లేని డైరెక్టర్లు కథ రచయితలతో రాయించుకుంటే మంచిది…
.