కెసీఆర్ మౌనం పట్ల టీఆర్ఎస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారా

రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఇంతలా హాట్ హాట్ గా మారినా ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఒక్కసారిగా రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.అయితే ప్రస్తుతం బీజేపీ తమదైన రాజకీయ వ్యూహంతో పెద్ద ఎత్తున క్షేత్ర స్థాయి కార్యకర్తల నిర్మాణంపై దృష్టి పెడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్థిగా నిలవాలన్న ఏకైక బలమైన వ్యూహంతో లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

 Are Trs Leaders Dissatisfied With Kcr Silence Trs Party, Kcr-TeluguStop.com

అయితే బండి సంజయ్ అరెస్ట్ తరువాత రెండు, మూడు రోజుల వరకు ఏ ఒక్క టీఆర్ఎస్ నేత కూడా స్పందించలేదు.మూడు రోజుల తరువాత మంత్రి కెటీఆర్ విలేఖరుల సమావేశం నిర్వహించి బండి సంజయ్ అరెస్ట్ జరిగిన రోజుకు సంబంధించిన విశేషాలను మాత్రమే ప్రస్తావిస్తూ సెటైరికల్ గా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

అయితే రాష్ట్రంలో ఇంతలా జరుగుతున్నా ముఖ్యమంత్రి కెసీఆర్ స్పందించకపోవడం పట్ల టీఆర్ఎస్ నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.

ఇలా చూస్తూ ఉండడం వల్ల బీజేపీ బలపడటానికి ఎక్కువ అవకాశాలను ఇచ్చిన వాళ్ళం అవుతామన్న భావన టీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.ఇలా అయితే హుజూరాబాద్ తరహా ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా చూసే అవకాశం ఉందని ఇంకొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను అంతర్గతంగా వ్యక్తం చేస్తున్నారు.అయితే కెసీఆర్ ను చాలా దగ్గర చూసిన వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఏమిటంటే కెసీఆర్ ఏది చేసినఆ చాలా వ్యూహాత్మకంగా ఉంటుందని సరైన సమయంలో వ్యూహాన్ని ప్రయోగిస్తారని పలువురు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

టీఆర్ఎస్ లో కొంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే కెసీఆర్ , కెటీఆర్ మాట్లాడితే తప్ప మిగతా ఎవరు మాట్లాడినా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి నేడు లేదనే విషయం ప్రస్తుత పరిస్థితులను బట్టి మనకు అర్ధమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube