ఆ మూడు పార్టీలు ఇప్ప‌ట్లో పోటీ ఇవ్వ‌లేవా.. ఏపీ రాజ‌కీయం వైసీపీ, టీడీపీదేనా..?

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ద్విముఖంగానే ఉన్నట్లు కనబడుతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.తమిళనాడు మాదిరిగా రెండు పార్టీలు చుట్టూతనే పాలిటిక్స్ కేంద్రీకృతమవుతున్నట్లు కనబడుతున్నది.

 Are Those Three Parties Not Competing Now Is Ap Politics Ycp Tdp Only, Ap Politi-TeluguStop.com

ఏపీలో అయితే టీడీపీ లేదా వైసీపీ రాజకీయ అధికారంలోకి వస్తాయి తప్ప బీజేపీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలు పోటీ ఇవ్వలేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఏదో ఒక పార్టీకి తోక లాగానోలేదా పొత్తుల్లో ఉండి నాలుగు సీట్లు గెలుచుకునే చాన్సెస్ ఉన్నాయి తప్ప సరియైన పోటీ ఇవ్వడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరగుతున్నది.

ఏపీలో 1982లో టీడీపీ స్థాపన తర్వాత అధికారాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే సొంతం చేసుకున్నాయి.విభజిత ఏపీలో సైతం అలాంటి పరిస్థితులే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

విభజిత ఏపీలో తొలిసారి చంద్రబాబు అధికారంలోకి రాగా ఐదేళ్ల తర్వాత సీన్ రివర్స్ అయింది.టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది.

ఇకపోతే 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన వైసీపీ అధినేత జగన్ మరో ఇరవై ఏళ్ల పాటు అధికారంలో ఉంటారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ మేరకు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

అయితే, గతంతో పోల్చితే టీడీపీ బాగా చతికిల పడింది.పరిషత్ ఎన్నికల్లో ఫ్యాన్ హవా ముందు సైకిల్ బేజారుపాలైంది.

ఈ క్రమంలోనే అధికార వైసీపీకి ఒకవేళ పోటీ ఇవ్వాల్సి వస్తే మళ్లీ టీడీపీ తప్ప బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌కు అంత కెపాసిటీ లేదని అనుకుంటున్నారు.టీడీపీ పుంజుకోకపోతే ఇక భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి రాదని సొంత టీడీపీ పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu Ap, Bjpjanasena, Congress, Janasena, Pawan Kalyan, Somu Veerraju-Politica

ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తులుగా బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు ఎదగాలని మరికొందరు అంటున్నారు.అయితే, వైసీపీ లేదా టీడీపీ కాకుండా ఇతర శక్తులు అవతరించాలని కోరుకుంటున్నారు.ఇకపోతే బీజేపీతో జనసేన పొత్తులో ఉంది.గతంతో పోల్చితే ఓటింగ్ పర్సంటేజీ కూడా జనసేనకు పెరిగింది.ఈ క్రమంలోనే పార్టీ కేడర్‌పై దృష్టి పెట్టి స్థానిక సమస్యలపై పోరాటం చేస్తే తృతీయ శక్తిగా ఏపీ రాజకీయాల్లో బీజేపీ-జనసేన అవతరించొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube