తీన్మార్ మ‌ల్ల‌న్న‌తో ఆ నేత‌కు చెక్ పెట్ట‌బోతున్నారా..?

తెలంగాణలో వ‌ర్గ పోరు ఉన్న పార్టీ ఏది అంటే అంద‌రికీ ముందుగా గుర్తుకు వ‌చ్చేది కాంగ్రెస్ మాత్ర‌మే.ఎందుకంటే ఆ పార్టీలోనే ప‌ర‌స్ప‌రం ఒక‌రిపై ఒక‌రు బాహాటంగానే విమ‌ర్శ‌లు చేసుకుంటారు.

 Are They  Going To Check That Leader With Teenmar Mallanna Details, Teenmar Mall-TeluguStop.com

అయితే ఇప్పుడు బీజేపీలో కూడా ఇలాంటి వ‌ర్గ విబేధాలు ఎక్కువ‌యిపోతున్నాయి.అయితే అవి పైకి క‌నిపించ‌ట్లేదు.

ముందు నుంచి కూడా బీజేపీలో ఓ సాంప్ర‌దాయం ఉంటుంది.అందులో ఎవ‌రికైనా చెక్ పెట్టాలంటే అత‌నికి పోటీగా మ‌రో నేత‌ను పార్టీలోకి తీసుకువ‌స్తారు.

ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతోంది.

ఈట‌ల రాజేంద‌ర్ గెలుపుతో ఒక్క‌సారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న‌కు గ్రాఫ్ పెరిగిపోయింది.

అన్ని పార్టీల్లోనూ ఆయ‌న‌కు మంచి ఇమేజ్ వ‌చ్చేసింది.దీంతో ఆయ‌న మీద ఉన్న హైప్‌ను త‌గ్గించేందుకు ఇప్పుడు బీజేపీలోకి తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది.

జ‌ర్న‌లిస్టుగా చాలా ఫేమ‌స్ అయిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది.ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీలోనూ చేర‌ని మ‌ల్ల‌న్న‌కు అన్ని పార్టీల నుంచి మంచి ఆఫర్లు అందాయి.

కానీ ఆయ‌న మాత్రం బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారు.మ‌ల్ల‌న్న చేరిక‌తో పార్టీలో ఈట‌ల దూకుడుకు చెక్ పెట్టొచ్చ‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు.

Telugu Bandi Sanjay, Etala Rajender, Bjp, Kishan Reddy, Mallannna Bjp, Telangana

ఈట‌ల రాజేంద‌ర్‌కు బండి సంజ‌య్‌, కిష‌న్ రెడ్డిల‌కు మించి ఇమేజ్ పెరుగుతుండ‌టంతో ఆయ‌న గ్రాఫ్‌ను పడేసెందుకు మ‌ల్ల‌న్న‌ను తీసుకొస్తున్న‌ట్టు  తెలుస్తోంది.రేపు మ‌ల్ల‌న్న బీజేపీలో చేర‌బోతున్నారు.తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను అడ్డు పెట్టుకుని ఈట‌ల దూకుడుకు క‌ళ్లెం వేసి త‌మ ఆధీనంలో ఉంచుకోవాల‌ని బీజేపీ తెలంగాణ అగ్ర నేత‌లు భావిస్తున్నారంట‌.ఇక ఈ విష‌యంలో ముందుగానే మ‌ల్ల‌న్న‌తో కూడా చ‌ర్చించ‌గా ఆయన కూడా ఓకే అన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌ల్ల‌న్న‌ను అస్త్రంలా వాడుకుని త‌మ ఇమేజ్‌ను మ‌ళ్లీ పెంచుకోవాల‌ని చూస్తున్నారు టీబీజేపీ నేత‌లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube