ప్చ్.. కేసీఆర్ తో స్నేహానికి వారు భయపడుతున్నారా ?

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు , ప్రాంతీయ పార్టీ అధినేతలను కలుస్తూ , బిజెపి వ్యతిరేక పోరాటంలో తమతో కలిసి రావాల్సిందిగా కెసిఆర్ అభ్యర్థిస్తూనే వస్తున్నారు.

 Are They Afraid Of Friendship With Kcr? Kcr, Telangana,telangana Cm, Bjp, Centr-TeluguStop.com

మొదట్లో ఈ విషయంలో కెసిఆర్ సానుకూలత సాధించినట్లే కనిపించినా,  బిజెపి వంటి బలమైన పార్టీతో తలపడేందుకు చాలా ప్రాంతీయ పార్టీలు సాహసం చేయలేకపోతున్నాయి .ఇప్పటికే చాలా ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడంలో బిజెపి అగ్రనేతలు సక్సెస్ అయ్యారు.ఇక ఆ పరిస్థితిని చూసిన తర్వాత అధికార పార్టీగా ఉన్న బిజెపితో తలపడడం అంటే కొరివితో తల గొక్కోడమే  అన్న అభిప్రాయం బలంగా ఆయా ప్రాంతీయ పార్టీల అధినేతలోకి వెళ్లిపోవడంతో కెసిఆర్ ఈ స్థాయిలో  వారిపై ఒత్తిడి చేస్తూనే బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీల కూటమిని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.     అయితే ఆ కూటమిలో చేరి యక్టివ్ అయ్యేందుకు చాలామంది ఇష్టపడడం లేదు.

ఈ క్రమంలోని కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వంటి వారితో కలిసి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేశారు.

అయితే కార్యరూపం దల్చకపోవడం తో  కొత్త జాతీయ పార్టీ అంటూ హడావుడి చేస్తున్నారు .తెలంగాణ ఉద్యమం తరహాలోని దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరినీ ఏకం చేసి వారి ద్వారా రైతు ఉద్యమం చేపట్టి,  జాతీయస్థాయిలో ఏర్పాటు చేయబోయే పార్టీని దేశవ్యాప్తంగా తీసుకువెళ్లాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట.ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేయాలని కేసీఆర్ మొదటి నుంచి భావిస్తూ వస్తున్నా,  ఇప్పుడు ఆ అనుకూల  పరిస్థితులు లేకపోవడం,  ఎవరూ కెసిఆర్ మాట నమ్మి బీజేపీ వంటి బలమైన పార్టీతో శత్రుత్వం పెట్టుకునేందుకు,  దాని పర్యవసనాలను అనుభవించేందుకు కానీ  సిద్ధంగా లేకపోవడం వంటివన్నీ  కెసిఆర్ కు ఇబ్బంది కలిగించే అంశాలే .   

Telugu Central Bjp, Congress, Nithish Kumar, Stalin, Telangana, Telangana Cm-Pol

 ఇవన్నీ కేసీఆర్ గ్రహించబట్టే జాతీయ పార్టీ ఏర్పాటు చేసే పనుల్లో బీజీ గా ఉండడం తో పాటు, తెలంగాణలో బిజేపి ని టార్గెట్ చేసుకుంటూ, బీజేపీ వంటి బలమైన పార్టీని డి కొట్టగలిగిన సత్తా తమకే ఉందనే సంకేతాలను  పంపించి తన పని చక్కబెట్టుకునే పనుల్లో కేసీఆర్ నిమగ్నం అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube