బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొనబోయేది వీరేనా?

బిగ్ బాస్ సీజన్ 1 ఇలా ముగిసిందో లేదో, అప్పుడే బిగ్ బాస్ సీజన్ 2 గురించి చర్చలు మొదలయ్యాయి.అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శివబాలాజీ సీజన్ 1 టైటిల్ ని ఎగరేసుకుపోగా, సీజన్ కూడా అంచనాలకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ మేకర్స్.

 Are These The Contestants Of Big Boss Telugu 2 ?-TeluguStop.com

ఏప్రిల్ లో మొదలయ్యే అవకాశమున్న సీజన్ 2 కోసం ఇప్పటినుంచే సెలబ్రిటీలతో సంప్రదింపులు జరుపుతున్నారట.ఆ రూమర్స్ లో వీరి పేర్లు వినబడుతున్నాయి.

తేజస్వీ మడివాడను సీజన్ 1 కోసమే అల్రెడి అడిగేసారు‌.మరి అప్పుడు ఎందుకు వదులుకుందో కాని, సీజన్ 2 ఈ అమ్మడు చేసినా చేయవచ్చు.

గ్లామర్ కోసం ఛార్మీతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట.కాని ఛార్మీ పూరి జగన్నాథ్ సినిమాలను హ్యాండిల్ చేస్తూ బీజీబిజీగా గడుపుతోంది.

హౌజ్ లోకి వచ్చేందుకు ఈ హాట్ హీరోయిన్ సుముఖత వ్యక్తపరుస్తుందో లేదో చూడాలి‌.

హ్యాపి డేస్ ఫేమ్ వరుణ్ సందేశ్, సింగర్ గీతా మాధురి, హీరో తరుణ్, యాంకర్ లాస్య, యాక్టర్ తనీష్ ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న మిగితా పేర్లు.

మరి నిజంగానే వీరితో సంప్రదింపులు జరుపుతున్నారో లేక ఇంటర్నెట్ లో పుట్టుకొచ్చే ఎన్నో గాలికబుర్లలో ఇది ఒకటా అనేది తేలాలి.

ఎప్రిల్ లోనే సెకండ్ సీజన్ మొదలైనా, దానికింకా చాలా అంటే చాలా టైమ్ ఉంది.

ఆ టైమ్ వరకు వీరిలో షో కోసం అందుబాటులో ఉండేది ఎంతమందో, ఖాలిగా ఉండేది ఎంతమందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube