వాహనాల పార్కింగ్ విషయంలో ఇవి తప్పనిసరి.. లేదంటే జరిమానాలు తప్పవు.. ?

నగరంలో ప్రస్తుతం ఎక్కడికి వెళ్లిన పార్కింగ్ ఫీజ్ అంటూ వసూలు చేస్తూ ఉండటం అందరికి తెలిసిందే.అడ్డూ అదుపు లేకుండా, ఇష్టారాజ్యంగా పార్కింగ్‌ ఫీజు వసూళ్లు చేస్తున్నారు.

 Are These Mandatory In Case Of Parking Of Vehicles, Hyderabad, Free Parking, Sho-TeluguStop.com

అయితే ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ నిబంధలను కఠినతరం చేయనుంది.

ఇందులో భాగంగా పార్కింగ్‌ చేసిన మొదటి 30 నిమిషాల వరకు ఎవరికీ రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

చెల్లించాలని మొండికేస్తే ఫొటో తీసి ఈవీడీఎంకు ఆన్‌లైన్‌లో లేదా ట్విట్టర్‌లో షేర్‌ చేయండని వెళ్లడిస్తుంది.

అక్రమంగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేసినట్లు తగిన ఆధారాలతో సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌కు షేర్‌ చేస్తే పరిశీలించి ఉల్లంఘనులకు జరిమానా విధించనున్నామని డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి తెలిపారు.

అదీగాక ఈవీడీఎం ట్విట్టర్‌లో కానీ, జీహెచ్‌ఎంసీ టోల్‌ఫ్రీ నంబరులో సమాచారం అందిస్తే వెంటనే తమ సిబ్బంది అక్కడికి వెళ్లి చర్యలు తీసుకుంటారని వివరించారు.

ఇకపోతే పార్కింగ్ ఫీజు వసూల్ చేసే వారి వద్ద ఇవి తప్పనిసరి లేదంటే జరిమానాలు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు.

ఆ వివరాలు చూస్తే.నోటీసు మేరకు అన్ని వాణిజ్య సంస్థలు, నిర్ణీత నమూనాలో పార్కింగ్‌ టికెట్లను ముద్రించాలి.

టికెట్లపై పార్కింగ్‌ నిర్వహణ ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్‌ నంబరు తప్పని సరిగ్గా ఉండాలి.

ఇక పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తే ‘పెయిడ్‌’ అని, ఉచితమైతే ఎగ్జెంప్టెడ్‌’ అనే స్టాంపు వేయాలి.

అంతే కాకుండా పార్కింగ్‌ ఇన్‌చార్జి సంతకంతో కూడిన పార్కింగ్‌ టికెట్లను వాహనదారులకు అందించాలి.కాగా ఈ ఉల్లంఘనలను విస్మరించిన వారికి రూ.50వేలు జరిమానా విధించడం జరుగుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube