అంతరిక్షంలో ముగ్గురు సూర్యుళ్లు వున్నారా... కారణం ఇదే?

భూమిమీద వున్న మనకు అంతరిక్షం అంటే ఓ ప్రత్యేకమైన అనుభూతి, ఇమేజినేషన్ ఉంటాయి.దాని గురించి అనేక పుస్తకాలు, ఆర్టికల్స్ చదివి ఇలా వుంటుందా? అని ఆశ్చర్యపోతుంటాం.అందుకే స్పెస్ అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.ఇక ప్రజలకే అలా ఉంటే పరిశోధకులకు ఇంకెలా ఉంటుంది.స్పేస్ అంటే వారికొక ఛాలెంజింగ్.అందుకే నిరంతరం దానిమీద పరిశోధలను జరుపుతూ వుంటారు.

 Are There Three Suns In Space  Is This The Reason , Space, 3suns, Viral Latest,-TeluguStop.com

అందుకే ప్రపంచ దేశాలు వేల కోట్లు ఖర్చు పెట్టి అంతరిక్ష శోధన చేస్తుంటారు.

ఇందులో భాగంగానే తాజాగా కోపెన్హజెన్ యూనివర్సిటీలోని ‘నీల్స్ బోర్ ఇన్స్‌స్టిట్యూట్ వారు తాజాగా అంతరిక్షంలో అరుదైన నక్షత్ర వ్యవస్థను కనుగొని, ఆశ్చర్యపోయేలా చేసారు.అవును… తాజాగా ఈ పరిశోధనకు సంబంధించిన విషయాలను ఇన్స్‌స్టిట్యూట్ వారు ప్రకటించారు.తమ పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు మూడు సూర్యుళ్లు ఉన్న నక్షత్ర వ్యవస్థను కనుగొనడం గమనార్హం.

చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి నక్షత్ర వ్యవస్థను కనిపెట్టిన దాఖలాలు లేవు.మూడు సూర్యుళ్లు ఉన్న తొలి నక్షత్ర వ్యవస్థగా దానిని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇందులో రెండు సూర్యుళ్లు మూడో సూర్యుని చుట్టూ కక్షచేస్తూ భ్రమిస్తున్నాయి.మూడో సూర్యుడు మొదటి రెండు సూర్యళ్ల కన్నా చాలా పెద్దగా ఉంది.

ఈ నక్షత్ర వ్యవస్థలో నక్షత్రాలు చాలా దగ్గరగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలపడం గమనార్హం.ఇదే విషయం ఇపుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.

ఈ నేపథ్యంలో కొంతమంది మూడు సూర్యుళ్లు వుండడమేమిటి అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరికొంతమంది ఆ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలకు ముగ్ధులవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube