కెసీఆర్ వేసిన ఈ వ్యూహంతో బీజేపీకి మరిన్ని చిక్కులు తప్పవా?

తెలంగాణ రాజకీయాలు టీఆర్ఎస్-బీజేపీ మధ్య  మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున సవాళ్ళు, ప్రతి సవాళ్ళు జరుగుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం.

 Are There Any More Implications For The Bjp With This Strategy By Kcr  Kcr, Trs-TeluguStop.com

అయితే యాసంగిలో వరి పండించండి, కెసీఆర్ మెడలు వంచైనా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు కెసీఆర్ జోక్యంతో పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే.

ఇక తదనంతరం కేంద్రం నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని లెటర్ తీసుకురావాలని విసిరిన సవాల్ కు సైతం బీజేపీ నుండి ఆశించిన సమాధానం రాకపోవడంతో ఇక కెసీఆర్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

అయితే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సమయంలో కావచ్చు టీఆర్ఎస్ నుండి ఎటువంటి విమర్శలు అనేవి రాకపోవడంతో ఇక బీజేపీ స్వేచ్చగా ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయడమే కాదు, ఏకంగా విజయం సాధించిన పరిస్థితి ఉంది.

Telugu @bjp4telangana, @cm_kcr, Bandi Sanjay, Bjp, Farmmers, Telangana, Trs, Ts

అయితే బీజేపీ ఇక తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీకి మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టిన పరిస్థితి ఉంది.తాజాగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఈ నెల 18 న ధర్నా చేపట్టనున్నామని, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సూటిగా యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేస్తారా చేయరా అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని, అంతేకాక యాసంగిలో వరి ధాన్యం వేసే విషయంపై బండి సంజయ్ వ్యాఖ్యలపై అదే స్టాండ్ తో ఉన్నారా, ఒకవేళ అదే స్టాండ్ తో లేకపోతే తప్పుగా మాట్లాడానని, రైతులను క్షమించమని కోరి ముక్కు నేలకు రాయాలని కెసీఆర్ బండి సంజయ్ కి సవాల్ విసిరారు.ఏది ఏమైనా కెసీఆర్ వేసిన ముక్కుసూటి సమాధాన వ్యూహంలో బీజేపీ చిక్కిందని ఇక రానున్న రోజుల్లో బీజేపీని వ్యూహాత్మకంగా దెబ్బ తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube