ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు టీడీపీ నేతల మీద వైసీపీ బాణాలు విసురుతున్న సంఘటనలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా గతంలో అశోక్ గజపతి రాజు మీద ఇలాంటి ప్రయత్నాలు చేసి విఫలం అయింది.
ఆయన్ను మాన్సాస్ చైర్మన్ పదవి నుంచి తొలగించి ఆయన అన్న కూతురు సంచైతకు అప్పగించింది.కానీ ఆయన కోర్టుకు వెళ్లి తన పంతం నెగ్గించుకున్నారు.
కోర్టు ఆయన్నే నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఇక రామతీర్థం ఆలయ చైర్మన్ గా కూడా ఆయన్నే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు.
కాగా ఆయన విషయంలో కొంతకాలంగా మౌనంగా ఉంటున్న ఏపీ సర్కార్ ఇప్పుడు పంజా విసిరేందుకు రెడీ అవుతోంది.ఎలాగూ న్యాయస్థానంలో గజపతి రాజును ఎదుర్కోలేమని జగన్ భావిస్తున్నారంట.
అందుకే రాజుగారి ఈగో మీద దెబ్బ కొట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగానే రామతీర్థం ఆలయాన్ని పునర్నిర్మించేందుకు రెడీ అవుతున్నారంట.
గతంలో ఈ ఆలయంలోని రాముని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.కాగా ఈ దుండగులను ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం పట్టుకోలేకపోయింది.
అయితే ఆ మచ్చను పోగొట్టుకునేందుకు ఇప్పుడు జగన్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు వైసీపీ రెడీ అవుతోంది.ఇందులో భాగంగానే ముగ్గురు మంత్రులు కూడా ఆలయంలో పూజలు నిర్వహించారు.కానీ ఆలయ చైర్మన్ అయిన గజపతి రాజుకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు.పెత్తనం మొత్తం మంత్రులే చూసుకుంటున్నారు.కనీసం శిలాఫలకం మీద కూడా గజపతి రాజు పేరును పెట్టేందుకు ఇష్టపడట్లేదని తెలుస్తోంది.మొత్తానికి ఈ విధంగా గజపతి రాజుకు చెక్ పెడుతున్నారు వైసీపీ పెద్దలు.
మరి ఆయన దీనిమీద ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి.ఒకవేళ దీని మీద కూడా ఆయన న్యాయస్థానానికి వెళ్తే జగన్ సర్కారుకు మరోసారి ఇబ్బందులు తప్పవు.