సీనియర్ల కు నిరాశ తప్పదా ? జగన్ ఆ మాట చెప్పేస్తారా ? 

రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీలో భారీగా మార్పులు తీసుకొచ్చేందుకు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా కనిపిస్తున్నారు.అప్పుడే ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తూ ఉండడంతో,  జనాల్లోకి వెళ్ళేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి.

 Are Seniors Disappointed Will Jagan Say That Ysrcp, Ap,tdp, Ysrcp Seniour Leade-TeluguStop.com

ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ ఈ రాజకీయవేడిని మరింత పెంచే పనిలో పడ్డారు.ఇక రాబోయే ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదనే విషయాన్ని జగన్ గుర్తించారు .

      ప్రస్తుతం పార్టీ సీనియర్ నాయకులకు పెద్దగా పదవులు దక్కకపోవడంతో వారు అసంతృప్తిగా ఉండడం,  పదేపదే తాము సీనియర్లు అన్నట్లుగా వ్యవహరిస్తూ కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్న జగన్ మౌనంగానే ఉంటున్నారు.  అయితే 2024 ఎన్నికల్లో మాత్రం పార్టీలోకి కొత్త రక్తాన్ని ఎక్కించాలని చూస్తున్నారు.

ఈ మేరకు సీనియర్ నాయకులు పక్కనపెట్టి వారి స్థానంలో వారి వారసులకు కానీ,  యువ నాయకులు కానీ అవకాశం ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారట.సీనియర్ నాయకులకు టికెట్లు ఇవ్వకపోయినా,  వారి స్థాయికి తగ్గట్లుగా రాజ్యసభ సభ్యత్వం కానీ ఇతర నామినేటెడ్ పోస్టులను ఇచ్చి వారి గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకోవాలని ప్లాన్ తో ఉన్నట్లు సమాచారం.   

Telugu Ap, Jagan, Ysrcp-Politics

  వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన మొదటి మంత్రివర్గ విస్తరణ,  రెండో విస్తరణలోను చాలామంది సీనియర్ నాయకులను జగన్ పక్కన పెట్టారు. కొంతమందిని మొహమాటంగా కొనసాగిస్తున్నారు .అయితే సీనియర్ నాయకులు కారణంగా జిల్లాల్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండడం,  వారు ప్రాధాన్యం ఎక్కువగా కోరుకుంటూ ఉండడంతో , ఆ స్థాయిలో వారికి ప్రాధాన్యం దక్కకపోవడం వంటి కారణాలతో అసంతృప్తితో ఉంటూ… సందర్భం వచ్చినప్పుడల్లా జగన్ కు ఇబ్బందికరంగా మారారు.దీంతో పార్టీ ప్లీనరీలో కానీ , సీనియర్ నాయకులతో కీలక సమావేశం ఏర్పాటు చేసి కానీ ఈ విషయాన్ని నేరుగా వారికే చెప్పాలనే ఆలోచనలో జగన్ ఉన్నారట.

  సీనియర్లకు పార్టీ టికెట్ కేటాయించకపోయినా,  వారి వారసులకు అవకాశం ఇవ్వడంతో వారిలో పెద్దగా అసంతృప్తి ఉండదు అనే లెక్కల్లో జగన్ ఉన్నట్లు సమాచారం.ఈ మేరకు అప్పుడే  సీనియర్ నాయకుల జాబితాను శబ్దం చేసుకున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube