శానిటైజర్ వాడి పెంపుడు జంతువులను ముట్టుకుంటున్నారా ? ఇది తెలుసుకోండి!

కరోనా రాకతో మనుషుల మధ్య దూరం చాలా పెరిగిపోయింది.అసలు మనిషికి మనిషి ఆనుకోవాలంటేనే జంకుతున్నారు.

 Sanitizers,pet Animals,instant Cleansers,no Harmful-TeluguStop.com

కాగా నేటి సమాజంలో మనుషులు మూడు వస్తువులను ఎమర్జెన్సీ కింద భావిస్తూ ఎక్కడివెళ్లినా.తమ వెంటే ఎల్లప్పుడూ ఉండేలా చూసుకుంటున్నారు.

అవేనండి మాస్క్, హాండ్ శానిటైజర్, సోషల్ డిస్టెన్స్.మీరు కూడా అవిపాటిస్తున్నారా.పాటించకపోతే వెంటనే పాటించండి.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి ఎప్పుడూ మీ వెంటే ఉండటం ఎంతో భద్రం.అయితే ప్రస్తుతం హ్యాండ్ శానిటైజర్లకు డిమాండ్ చాలా పెరిగిపోయింది.

వివిధ రకాల పేర్లతో శానిటైజర్లు మార్కెట్ లో దర్శనమిస్తుంటాయి.

జనాలు కూడా అవి మంచివేనా.అవి ఎంత వరకు ఆరోగ్యకరమైనవని, దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది మాత్రం తెలుసుకోకుండా కొని వాడేస్తుంటారు.

కాని దాని వల్ల ఎదురయ్యే అనర్థాలను మాత్రం లెక్క చేయరు.అయితే మనం వాడే హ్యాండ్ శానిటైజర్ల మూలంగా పెట్ లు ప్రమాదానికి గురి కావొచ్చని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

సాధారణంగా మనం వాడే హ్యాండ్ శానిటైజర్లు కెమికల్ తో తయారైనదై ఉంటుంది.అయితే దాన్ని వాడి పెట్ లను ముట్టుకుంటే వాటికి ప్రమాదం జరగొచ్చని నిపుణులు, డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Telugu Harmful, Pet Animals, Sanitizers-Telugu Health

మరీ ముఖ్యంగా ఈ శానిటైజర్ల వల్ల పెట్ లకు ఎలర్జీ, కంటి చూపుకు ప్రమాదం, అలాగే వాంతులు, సీజర్స్ వంటి వాటి భారిన పడే అవకాశం ఉంది.మరెలా కరోనా నుంచి వీటిని కాపాడుకోవడం అని మీరు బాధపడుతుండొచ్చు.పెట్ లకు వాడే శానిటైజర్లు ఇండియన్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి.ఈ శానిటైజర్స్ యాంటీపెస్టిక్ లక్షణాలను కలిగి ఉండటం మూలంగా వాటికి ఎటువంటి హాని జరిగే అవకాశం ఉండదు.

సో ఈ శానిటైజర్స్ ను బేఫికర్ గా పెట్ లకు రాయోచ్చని తెలుపుతున్నారు నిపుణులు.

Telugu Harmful, Pet Animals, Sanitizers-Telugu Health

ఈ శానిటైజర్ పెట్స్ కు బాక్టీరియా, జెర్మ్స్ నుంచి మంచి రక్షణ కల్పిస్తాయి.అలాగే ఇన్స్టెంట్ క్లీన్సర్స్ లాగా కూడా ఈ శానిటైజర్ ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.అయితే ఈ శానిటైజర్ లో బెంజాల్కొనియం క్లోరైడ్ ఉంటుంది.

ఇది పెట్స్ కు జెర్మ్ నాశినిగా కూడా పని చేస్తుంది.అంటే ఇది దాదాపుగు 99.9 శాతం క్రిములను చంపేస్తుంది.అయినా ఈ శానిటైజర్లలో ఆల్కహాల్ ఏ మాత్రం లేకపోయినా క్రిములను చంపేస్తుంది.

కాబట్టి ఇప్పటికైనా పెట్స్ కు ఈ శానిటైజర్ల ను వాడండి.అయితే ఇది కుక్కలతో పాటుగా పిల్లలకు కూడా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఈ శానిటైజర్లను వాడాలనుకుంటే మాత్రం ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube