పీఆర్సీపై కేసీఆర్ హామీతో ఉద్యోగులు సంతృప్తి చెందుతారా?

పీఆర్సీపై ప్రభుత్వం పై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి.ఎప్పటినుండో పీఆర్సీ కొరకు వేచి చూస్తున్న ఉద్యోగ సంఘాలు తాజాగా ప్రభుత్వం తీసుకున్న పీఆర్సీపై భగ్గుమన్నాయి.పీఆర్సీని 63 శాతానికి పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం 7.5 శాతం మాత్రమే ఫిట్ మెంట్ ప్రకటించడంతో ఉద్యోగులు భగ్గుమన్నారు.అంతేకాక గత ఎనిమిది సంవత్సరాలుగా ఉన్న అదనపు సౌకర్యాలను కూడా జాబితా నుండి ప్రభుత్వం తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఈ విషయంపై స్పందించిన ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాకు నమ్మకం ఉందని, తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కేసీఆర్ మదిలో ఉందని, కేసీఆర్ ను కలిసి మా అభ్యంతరాలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని, ఆయన ఉద్యోగులు హర్షించే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

 Are Employees Satisfied With The Kcr Guarantee On Prc?, Cm Kcr, Prc, Employee Un-TeluguStop.com

మరి కేసీఆర్ ఇచ్చే హామీతో ఉద్యోగులు సంతృప్తి చెందుతారా లేదా అనేది చూడాల్సి ఉంది.అదే విధంగా ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలు చోట్ల ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు రాష్ట్రమంతా కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube