నిమ్మగడ్డ కు ఇవన్నీ ఇబ్బందులే ? సస్పెండ్ అయ్యేది ఎంతమందో ?

ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం , ఎన్నికల కమిషన్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతూనే ఉంది.ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు చేరింది.

 Are All These Problems With  Nimmagadda  How Much Is Suspended , Nimmagadda Ram-TeluguStop.com

నేడు దీనిపై కీలక తీర్పు వెలువడనుంది.ఇదిలా ఉంటే ఎన్నికల కమిషన్ కు ఉన్న విచక్షణాధికారాలు మొత్తం ఉపయోగించి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తున్నారు.

కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో ఎన్నికలకు వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు.రమేష్ కుమార్ పదవి విరమణ చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదిలా ఉంటే నిమ్మగడ్డ మాత్రం ఎన్నికల నిర్వహణ కు సంబంధించి ఎవరు సహకరించినా, సహకరించకపోయినా ఈ ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్తుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అంటూ ప్రకటిస్తున్నారు.

ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు కలిగించినా, వారిని ఉపేక్షించేది లేదని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

వాస్తవంగా ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది అంటే పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఉద్యోగులంతా వెళ్ళిపోతారు.ఆయన ఆదేశాల మేరకు అంతా నడుచుకోవాల్సి ఉంటుంది.కానీ ఏపీలో పరిస్థితి మాత్రం వేరేలా ఉంది.ఉద్యోగులు కరోనా వైరస్ ప్రభావం కారణంగా తాము ఎన్నికల విధుల్లో పాల్గొనలేము అంటూ చెప్పేస్తున్నారు.

ఎన్నికల విధుల్లో పాల్గొంటే ప్రభుత్వం ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.అలా కాకుండా నిమ్మగడ్డ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఆయన తీసుకునే క్రమశిక్షణ చర్యలకు సిద్ధం గా ఉండాలి.

Telugu Ap, Employees, Jagan, Janasena, Boady, Supreme, Ysrcp-Telugu Political Ne

ఏ విధంగా చూసుకున్నా అటు ఎన్నికల అధికారి ఇటు ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం అన్ని శాఖల ఉద్యోగులు ఎన్నికలలో పాల్గొనేందుకు ఏమాత్రం ఇష్టపడలేదు.నేడు సుప్రీం తీర్పు ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా వెలువడినా, అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనడం అనేది అనుమానంగానే ఉంది.రమేష్ కుమార్ ఎంతమంది అధికార్లపై చర్యలు తీసుకుంటారు అనేది అనేక క్లారిటీ రావాల్సి ఉంది అలా చేయడం కూడా ఎన్నికల కమిషన్ కు సాధ్యమయ్యే పని కాదు.

ఏ రకంగా చూసుకున్నా ఉద్యోగులు సహాయ నిరాకరణ చేసినా, మెరుపు సమ్మె కు దిగినా రమేష్ కుమార్ కు తలెత్తే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube