రాబోయే ఐపీఎల్ మ్యాచ్ లన్ని ఆ నగరంలోనేనా..?!

ఐపీఎల్ 2021 సీజన్ కి సంబంధించిన వేలంపాట ప్రక్రియ పూర్తయింది.కానీ ఈ సీజన్ కి సంబంధించిన తేదీలు ఇంకా ప్రకటించలేదు.

 Are All The Upcoming Ipl Matches In That City, Sports News, Ipl, Ipl 2021, Stadi-TeluguStop.com

ప్రతిసారి ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ తేదీ ముందస్తుగానే ప్రకటించేవారు.కానీ ఈ సీజన్ నిర్వహణ తేదీలు ప్రకటించకపోవడానికి కారణం భారతదేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటమేనని తెలుస్తోంది.

భారత దేశ వ్యాప్తంగా ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా నిబంధనలను అమలు చేస్తుండటం తో పాటు రాకపోకలపై ఆంక్షలు విధించారు.

దీంతో బీసీసీఐ బోర్డు ఐపీఎల్ మ్యాచ్ లను ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై ఒక నిర్ణయానికి రాలేక పోతుంది.

అయితే కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ మ్యాచ్ లను కేవలం 3 వేదిక లకే పరిమితం చేయనున్నారా? ఇండియన్ సూపర్ లీగ్ తరహాలో ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహించనున్నారా? అని అడిగితే అవుననే క్రీడా వర్గాల్లో సమాధానాలు వినిపిస్తున్నాయి.ఒకే నగరంలో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్ లన్నీ నిర్వహించాలని ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని.అందుకే ఇంకా తేదీలను ప్రకటించలేదని క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Telugu Bcci, Corona, Ipl, Ipl Season, Mumbai, Stadium-Latest News - Telugu

11 ఫుట్‌బాల్‌ టీమ్స్ ఆడుతున్న ఇండియన్ సూపర్ లీగ్( ఐఎస్ఎల్) ని ప్రస్తుతం గోవాలోని మూడు స్టేడియాలలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు.అయితే ఐఎస్ఎల్ తరహాలోనే ఐపీఎల్ ని ముంబైలోని బ్రబౌర్న్‌, వాంఖడే, డీవై పాటిల్‌ స్టేడియాల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే దిశగా బీసీసీఐ ముందు అడుగులు వేస్తోంది.కేవలం మూడు స్టేడియాల్లో నిర్వహిస్తే ఎక్కువ బయోబబుల్స్ ఏర్పాటు చేయడం అక్కర్లేదని ఫలితంగా చాలా డబ్బు ఆదా అవుతాయని ఐపీఎల్ నిర్వాహకులు భావిస్తున్నారు.ఒక్క ముంబై నగరంలోనే ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తే ప్రయాణ ఖర్చులు కూడా కలిసివస్తాయి.

కానీ ఇందుకు ఫ్రాంచైజీలు ఒప్పుకుంటాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube