సిద్ శ్రీరామ్ మరో పాటకు రికార్డ్ వ్యూస్..!

యువ గాయకుడు సిద్ శ్రీరామ్ ఏ పాట పాడినా సరే అది సూపర్ హిట్ అవుతుంది.అల వైకుంఠపురములో సామజవరగమన సాంగ్ తో సూపర్ హిట్ అవగా ఆ తర్వాత నీలి నీలి అకాశం సాంగ్ తో మరో సూపర్ హిట్ సాంగ్ పాడాడు.

 Ardhashatabdham Sid Sriram E Kannulu Song Record Views In Youtube, Ardhashatabdh-TeluguStop.com

అంతేనా సిద్ శ్రీరామ్ పాడాడు అంటే ఆ పాట సూపర్ హిట్ అన్నట్టే.యూట్యూబ్ లో సిద్ శ్రీరామ్ పాట రికార్డ్ వ్యూస్ రాబడుతున్నాయి.

లేటెస్ట్ గా అతను పాడిన ఏ కన్నులు చూడని సాంగ్ మిలియన్ మార్క్ వ్యూస్ రాబట్టింది.

రవీంద్ర పుల్లే డైరక్షన్ లో కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ జోడీగా వస్తున్న సినిమా అర్ధశతాబ్ధం.24 ఫ్రేంస్ సెల్యులాయిడ్, రిషిత శ్రీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ ఏ కన్నులు చూడని పాట ఆలపించారు.నౌపాల్ రాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ఈ సాంగ్ మేకింగ్ వీడియో 1 మిలియన్ మార్క్ వ్యూస్ రాబట్టింది.

ఈ సినిమా టీజర్ ను సుకుమార్.ఫస్ట్ గ్లింప్స్ రానా రిలీజ్ చేశారు.1 మిలియన్ మార్క్ అందుకున్న సిద్ శ్రీరామ్ ఏ కన్నులు చూడని సాంగ్ రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్ చేసింది.సాంగ్ మాత్రమే కాదు అర్ధశతాబ్ధం టీజర్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube