వచ్చే వారంలో పడిపోనున్న ఉష్ణోగ్రతలు.. మంచు తుఫాను హెచ్చరిక

ఆర్కిటిక్ సముద్రంలోని చల్లని గాలుల కారణంగా వచ్చే వారం అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.చల్లని గాలుల ప్రభావం మధ్య, దక్షిణ మరియు తూర్పు అమెరికాలపై పెను ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.

 Arctic Surge Expected To Bring Record Cold Temperatures November-TeluguStop.com

సోమవారం లేదా బుధవారం ఉష్ణోగ్రతలు పడిపోతాయని నేషనల్ వేదర్ సర్వీస్‌కు చెందిన జోనాథన్ ఎర్డ్‌మాన్ ట్వీట్ చేశారు.

జనవరిలో చోటు చేసుకునే వాతావరణ మార్పులు కాస్త ముందుగా నవంబర్‌లోనే ప్రజలు రుచి చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

 Arctic Surge Expected To Bring Record Cold Temperatures November-వచ్చే వారంలో పడిపోనున్న ఉష్ణోగ్రతలు.. మంచు తుఫాను హెచ్చరిక-Telugu NRI-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉత్తర మైదానాలు, ఎగువ మిడ్వెస్ట్‌లలో ఆదివారం.శీతల దక్షిణ మైదానాలు, ఒహియో లోయలో సోమవారం.

తూర్పు తీరం, దక్షిణ ప్రాంతాలలో మంగళవారం నాటికి చల్లని ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.

చికాగో మరియు మిన్నియాపొలిస్‌లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అతి కొల్డేస్ట్ వెటరన్స్ దినోత్సాన్ని జరిపేందుకు సిద్దమవుతున్నారు.మంగళవారం నాటికి ఈశాన్య, ఒహియో లోయ మరియు దక్షిణ ప్రాంతాలలో రికార్డు చలి ప్రారంభంకానుంది.అయితే అలబామా దక్షిణాన 30 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందని వెదర్ సర్వీస్ తెలిపింది.

కొన్ని ప్రాంతాల్లో చలితో పాటు మంచు తుఫాను కురిసే అవకాశం ఉంది.

#Arctic Surge #Temperatures

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు