ఉక్రెయిన్ సంక్షోభం : భారత్‌కు బైడెన్ సలహాదారు.. రష్యాపై అమెరికా ఆంక్షల వెనుక మాస్టర్ మైండ్ అతనే

ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగి నెల రోజులు గడుస్తున్న సంగతి తెలిసిందే.పుతిన్‌ను నిలువరించేందుకు అగ్రరాజ్యం అమెరికా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.

 Architect Of Joe Biden Administration’s Sanctions On Russia Daleep Singh In Ne-TeluguStop.com

రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం మద్ధతు కూడగట్టడంతో పాటు ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాల్ని అందజేస్తోంది.దీనితో పాటు శాంతి చర్చల ద్వారా సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తోంది.

అయితే ఈ విషయంలో భారత్ మద్ధతు అత్యంత కీలకంగా మారింది.ఇండియా తన పలుకుబడి ద్వారా రష్యాను శాంతింపజేయాలని అమెరికా, ఉక్రెయిన్‌లు కోరాయి.

అయితే మాస్కోతో వున్న చారిత్రాత్మక అనుబంధం.అమెరికా, రష్యాలతో వున్న ఆర్ధిక సంబంధాల నేపథ్యంలో భారత్ తటస్థంగా వుంటోంది.

ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన అమెరికా ప్రభుత్వ అగ్రశ్రేణి సలహాదారు దలీప్ సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ రానున్నారు.ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ సహా ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలను ఈ సందర్భంగా భారత అధినాయకత్వంతో దలీప్ సింగ్ చర్చించనున్నారు.

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్ భారత పర్యటన వేళ.దలీప్ కూడా ఢిల్లీలో దిగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.రెండు రోజుల చైనా పర్యటన ముగించుకుని లావ్రోస్ గురువారం సాయంత్రం లేదా శుక్రవారం భారత్‌లో కాలుపెట్టనున్నారు.

Telugu America, Architectjoe, Indopacific, Russia, Russianforeign, Ukraine-Telug

బైడెన్ యంత్రాంగంలో అంతర్జాతీయ ఆర్ధిక వ్యవహారాలపై డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా వున్న దలీప్ సింగ్ .మార్చి 30, 31 తేదీల్లో భారత్‌లో పర్యటిస్తారని వైట్‌హౌస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ సందర్భంగా బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ ద్వారా హై క్వాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రోత్సహించడం , ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ అభివృద్ధి సహా బైడెన్ సర్కార్ ప్రాధాన్యతలను దలీప్ చర్చిస్తారని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారిక ప్రతినిధి ఎమిలీ హార్న్ అన్నారు.

వచ్చే నెలలో వాషింగ్టన్‌లో జరగనున్న 2 ప్లస్ 2 విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశానికి సంబంధించిన సన్నాహాలు కూడా దలీప్ పర్యటనలో చోటు చేసుకునే అవకాశం వుంది.ఇక ఆయన పర్యటనలో ఉక్రెయిన్ సంక్షోభం ప్రధాన అంశంగా మారే అవకాశం వుందని నిపుణులు అంటున్నారు.

ఇకపోతే.ఏప్రిల్ 11న వాషింగ్టన్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు .అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌లతో చర్చలు జరపనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube