హీరో ఫీల్ అవుతాడని డైరెక్టర్ బయపడుతాడంటూ అర్చన షాకింగ్ కామెంట్స్?

ఎన్నో తెలుగు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి అర్చన ఈ మధ్య కాలంలో వరుస ఇంటర్వ్యూ ఇస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈమె తన సినీ కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

 Archana Shocking Comments That Director Afraid With The Hero Details, Archana,-TeluguStop.com

తాను చిన్నప్పటి నుంచి స్టేజ్ పర్ఫామెన్స్ చేస్తూ ఉండే దాన్నని, అది తన 6, 7వ తరగతిలోనే ప్రారంభమైందని ప్రముఖ నటి అర్చన అన్నారు.తన డ్యాన్స్ ప్రదర్శనను చూడడానికి నాలుగైదుసార్లు అక్కినేని నాగేశ్వరరావు కూడా వచ్చినట్లు ఆమె చెప్పారు.

ఆయన ఆమెను మెచ్చుకునేవారని, అంతేకాకుండా ఈ అమ్మాయి తప్పకుండా సినిమాల్లోకి వస్తుందని అనేవారు అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు.

ఇకపోతే తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఈవీవీ సత్యనారాయణ ప్రొడక్షన్ లో ఏదో ప్రాజెక్టు ఉందని తెలిస్తే ఆయనకి ఫోటోలు పంపించానని నటి అర్చన చెప్పారు.

అప్పుడు ఈవీవీ గారి దగ్గరికి తాను తన మదర్ వెళ్లి కలిసి మాట్లాడినప్పుడు ఆయన చాలా బాగా మాట్లాడారని అర్చన చెప్పారు.తెలుగులో ప్రస్తుతం హీరోయిన్లు ఎవరూ ఎక్కువగా లేరు.

ఆల్ ది బెస్ట్.అదీ కాకుండా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇస్తున్నావు అని ఈవివి అన్నట్లు అర్చన తెలిపారు.

ఆయన్ని ఆ రోజు కలవడం తనకు ఎప్పుడూ ప్రత్యేకమే అని ఆమె వివరించారు.

Telugu Actress Archana, Archana, Raghavendra Rao, Tollywood-Movie

ఇదిలా ఉండగా తను బాగా నటిస్తానని తనకు నమ్మకం ఉందని అర్చన అన్నారు.అయినా కూడా ఒక డైరెక్టర్ మాత్రం తనను మెచ్చుకునేవారు కాదని, ఎందుకంటే అక్కడ హీరో ఫీల్ అవుతాడని ఆ డైరెక్టర్ భయపడినట్లు నటి అర్చన చెప్పారు.నిజం చెప్పాలంటే అతను ఒక సెక్యూర్డ్ హీరో అయితే అలాంటిదేం పట్టించుకోరని ఆమె చెప్పారు.

అందుకేనేమో డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారితో కలిసి పనిచేయడం తనకు ఇప్పటికీ మెమొరబుల్ అని ఆమె అన్నారు.అంత పెద్ద డైరెక్టర్ తో పని చేయడం నిజంగా తనకు చాలా మంచి అనుభవమని ఆమె తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube