ఆ ప్రశ్న దర్శకనిర్మాతలనే అడగమంటున్న అర్చన..!

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు అర్చన.తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 1లో అర్చన పాల్గొనగా ఆ షో ద్వారా అర్చనకు మంచి పేరు వచ్చినా అర్చన కెరీర్ మాత్రం పుంజుకోలేదు.

 Nenu Movie Heroine Archana Shocking Comments , Annapurnamma Gari Manavadu, Comme-TeluguStop.com

నటిగా అర్చనకు మంచి పేరు వచ్చినా అవకాశాలు మాత్రం ఎక్కువగా రావడం లేదు.ప్రస్తుతం అర్చన అన్నపూర్ణమ్మ గారి మనవడు అనే సినిమాలో బాలాదిత్యతో కలిసి నటిస్తున్నారు.

ఈ నెల 29వ తేదీన అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమా విడుదల కానుంది.సీనియర్ నటి అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ టైటిల్ రోల్స్ లో నటించారు.

జాతీయ అవార్డు గ్రహీత శివనాగేశ్వరరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఎం ఎన్ ఆర్ చౌదరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అర్చన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గతేడాది మనపై చాలా ప్రభావం చూపించిందని 2021 అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Telugu Archana, Nenu-Movie

అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమాలో మెడికల్ స్టూడెంట్ గా ప్రేమ పెళ్లి చేసుకున్న అమ్మాయి పాత్రలో నటిస్తున్నానని అన్నారు.అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించానని సినిమా విడుదలైన తరువాత తనకు అవకాశాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నానని పేర్కొన్నారు.తెలుగమ్మాయి అయినా తెలుగులో ఎక్కువ అవకాశాలు ఎందుకు రావడం లేదనే ప్రశ్న ఎదురు కాగా ఆ ప్రశ్న దర్శకనిర్మాతలనే అడగాలని అర్చన చెప్పారు.

తనకు ఏ పాత్ర ఇచ్చినా సిన్సియర్ గా చేయడం తెలుసని.తాను తెలిసిన దర్శకులను అవకాశాల గురించి అడగగలను కానీ తెలియని దర్శకులను అడగలేనని అన్నారు.

గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేస్తే అవకాశాలు తగ్గుతాయని తాను భావించనని అర్చన అన్నారు.తన భర్త దృష్టిలో తాను సూపర్ స్టార్ నని పెళ్లి తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని అర్చన చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube