హౌజ్ నుంచి తర్వాత బయటకు వచ్చేది ఆయనే. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్చన వ్యాఖ్యలు.!       2018-07-02   03:53:58  IST  Raghu V

వారాలు గడిచే కొద్దీ బిగ్ బాస్ 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. ప్రతి వారం ఒక్కొక్కరిపై ఎలిమినేషన్ పిడుగు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సంజన, నూతన్ నాయుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం గీతా మాధురీ, కిరిటీ, గణేష్ నామినేషన్లలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో.. గీతా మాధురీ, గనేష్‌లు సేఫ్ జోన్‌లోకి రావడంతో కిరిటీ ఇంటి నుంచి బయటకు వెళ్లక తప్పలేదు.

ఇక నెక్స్ట్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఇటీవలే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ నటి అర్చన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆమె దృష్టిలో నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది అతనే అంట. ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా.? వివరాలు మీరే చూడండి!

ఎలిమినేషన్ రౌండ్‌లో తర్వాత ఎలిమినేట్ అయ్యేది హేతువాది బాబు గోగినేనేనని జోస్యం చెప్పారు. అయితే ఆయనొక్కరే అని కాదని… మరో ఐదుగురు కూడా ఉన్నారని… ఆ పేర్లు బయటపెట్టలేనన్నారు. ఇదిలా ఉంటే వ్యాఖ్యాతగా నాని చక్కగా చేస్తున్నారని కితాబిచ్చారు. తారక్ గొప్పగా చేశాడని… అందులో ఏమాత్రం సందేహం లేదన్నారు. ఈ షో జనంలోకి వెళ్లడానికి టైమ్ పడుతుందన్నారు. హౌజ్‌లో తనకిష్టమైన వాళ్లు ఉన్నారని చెప్పిన అర్చన.. ఆ పేర్లు చెప్పడానికి మాత్రం అయిష్టత వ్యక్తం చేశారు. అయితే వాళ్లను సేవ్ చేయడానికి చివర్లో బయటపెడతా అన్నారు.

ఇప్పటికే బిగ్ బాస్ 2 కంటెస్టెంట్, హేతువాది బాబు గోగినేనిపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆధార్ చట్టాన్ని ఉల్లంగిస్తూ ఔత్సాహికుల ఆధార్ సమాచారాన్ని సేకరిస్తున్నారని, హేతువాద ప్రచారం కోసం నిధులు దుర్వినియోగం పరుస్తున్నారని కేవీ నారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు. గోప్యంగా ఉంచాల్సిన ఆధార్‌ సమాచారాన్ని బాబు గోగినేని, ఆయన అనుచరులు తమ సంస్థల ద్వారా పక్క దేశాలకు అందజేస్తున్నారని ఆరోపించారు. ఇది దేశ భద్రతకు కూడా ప్రమాదంగా మారుతుందని వారు ఫిర్యాదులో తెలిపారు.

బాబు గోగినేని గారిపై ఇవన్నీ కలిసి ఎలాంటి ప్రభావం పడుతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్స్ కోసం వేచి చూడాల్సిందే.!