వైరల్: తవ్వకాల్లో 800 సంవత్సరాల నాటి మమ్మీ బట్టబయలు..!

ఈ భూమి మీద మనకు తెలియని ఎన్నో రహస్యాలు, వింతలు దాగి ఉన్నాయి.వాటి కోసం ఇప్పటికి పురావస్తు శాఖ వారు అన్వేషణ చేస్తూనే ఉన్నారు.

 Archaeologists Found 800 Years Old Mummy In Peru Country Details, Viral Latest-TeluguStop.com

అలాగే మీరందరు మమ్మీల గురించి వినే ఉంటారు.మమ్మీ అంటే ఎవరికి వారు భయపడి పోతుంటారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో పురావస్తు శాఖ అధికారులు 800 సంవత్సరాలనాటి మమ్మీని కనిపెట్టారు.దానిని చుసిన శాస్త్రవేత్తలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.

పురావస్తు శాస్త్రవేత్తల్లో ఒకరు అయిన పీటర్ వాన్ డాలెన్ లూనా మమ్మీ గురించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తవ్వకాల్లో బయటపడిన ఆ మమ్మీ అవశేషాలు దక్షిణ అమెరికాలో ఆండియన్ ప్రాంతంలోని పర్వతాల సమూహ సమీపంలో ఒకప్పుడు నివసించిన తెగకు చెందిన వారిలో ఒకరిదిగా కనుగొన్నారు.

కాగా ఈ మమ్మీని లిమా ప్రాంతంలో కనుగొన్నామని తెలిపారు.అయితే ఇప్పుడు కనిపెట్టిన మమ్మీ శరీరం పురుషుడిదా లేదా స్త్రీదా అనేది ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు.

అలాగే ఆ మమ్మీని కొన్ని తాళ్లతో కట్టివేయబడిందని, ముఖానికి అడ్డంగా చేతులు పెట్టుకుందని అన్నారు.

Telugu Mummy, Yeras, America, Latest, Limra Area, Peru, Petervan-Latest News - T

ఒకవేళ అప్పట్లో ఆ తెగ వాళ్ళు అక్కడి వాళ్లకు ఈ రకంగానే అంత్యక్రియలు జరిపిస్తారేమో అని డాలెన్ లూనా చెప్పారు.అలాగే ఈ మమ్మీతో పాటు సిరామిక్ వస్తువులు, కూరగాయల అవశేషాలు, రాతి పనిముట్లు కూడా దొరికినట్లుగా ఆయన తెలిపారు.ఇంకా ఈ మమ్మీ గురించిన విషయాలు మరింత తెలుసుకునే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు ఉన్నారు.

అలాగే పెరూ ప్రాంతం ప్రపంచంలోనే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా పేరు గాంచింది పెరూ ఒకటి.పురాతన చారిత్రాత్మిక కట్టడమైన ‘మచు పిచ్చు’ ఇక్కడే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube