‘అరవింద సమేత’కు కలిసొచ్చే అంశం..రెండు వందల కోట్లు     2018-10-20   08:21:48  IST  Ramesh Palla

ఎన్టీఆర్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం అంతే ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం మొదటి వారం రోజుల పాటు వసూళ్లతో కుమ్మేసింది. దసరా సెలవులు కలిసి రావడంతో సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కుమ్మేయడంతో నాన్‌ బాహుబలి రికార్డులు కూడా దక్కాయి. ఇక దసరా కానుకగా మరో రెండు సినిమాలు విడుదల ఉన్న కారణంగా అరవింద సమేత జోరు తగ్గే అవకాశం ఉందని అంతా భావించారు.

Aravindha Sametha Inching Towards 200 Crore Club-

Aravindha Sametha Inching Towards 200 Crore Club

దసరా రోజు విడుదలైన ‘హలో గురూ ప్రేమకోసమే’, ‘పందెంకోడి 2’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ఈ రెండు చిత్రాలు కూడా అరవింద సమేత జోరుకు అడ్డు పడుతాయనే అనుమానాలు వ్యక్తం అయిన నేపథ్యంలో తాజాగా ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది. దసరా సెలవులు ఇంకో మూడు రోజులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అరవింద సమేత మరింత భారీ వసూళ్లను సమోదు చేయడం ఖాయంగా సినీ వర్గాల వారు భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి కొత్త రికార్డులు నమోదు అవుతున్నట్లుగా ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

మొదటి వారం ముగిసే వరకు 130 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ను ఈ చిత్రం రాబట్టింది. లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం రెండు వందల కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేస్తుందనే నమ్మకంను నందమూరి అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వారాంతంకు 160 కోట్లకు గ్రాస్‌ కలెక్షన్స్‌ చేరుకోనున్నాయి. ఆ తర్వాత ఈ చిత్రం కాస్త జోరు తగ్గినా కూడా పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో తప్పకుండా మరో వారం రోజుల పాటు కలెక్షన్స్‌ వచ్చే అవకాశం ఉంది. పోటీ లేకపోవడం అరవింద సమేతకు కలిసి వచ్చే అంశం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.