రివ్యూ : అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌ రివ్యూ అండ్ రేటింగ్  

రివ్యూ : అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌

రిలీజ్ డేట్‌ : 11 అక్టోబ‌ర్‌, 2018

బ్యాన‌ర్‌ : హారిక & హాసిని క్రియేష‌న్స్‌

ర‌చ‌న – ద‌ర్వ‌క‌త్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్‌

మ్యూజిక్‌ : థ‌మ‌న్‌.ఎస్‌.ఎస్‌

న‌టీన‌టులు : ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, జ‌గ‌ప‌తిబాబు, నాగ‌బాబు, సునీల్ త‌దిత‌రులు

నిర్మాత‌ : ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు)

సెన్సార్ రిపోర్ట్‌ : యూ / ఏ

ర‌న్ టైం : 161.30 నిమిషాలు ( 2.41.30 గంట‌లు )

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “అరవింద సమేత ఈరోజు భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది.. “ఎన్టీఆర్ , పూజా హెగ్డే” జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన “అరవింద సమేత” సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి..అంతేకాదు తొలిసారి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందోనని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూశారు…రాయలసీమ బ్యాక్డ్రాప్ తో నడిచే ఈ సినిమా ఇప్పటివరకూ తెలుగు తెరపై ఎవరూ తీయని విధంగా ఒక విభిన్నమైన కోణంలో త్రివిక్రమ్ మలిచారు..వరల్డ్ వైడ్ గా ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన , త్రివిక్రమ్ డైలాగ్స్ , కధ , అన్ని అంశాలు సినిమాని సక్సెస్ చేయనున్నాయా..? ఎంతవరకూ ప్రేక్షకుల అంచనాలని అందుకుందో తెలుగు స్టాప్ సమీక్షలో చూద్దాం..

Aravinda Sametha Veera Raghava Movie Review-

Aravinda Sametha Veera Raghava Movie Review

కధ :

బేస్ వాయిస్ తో సునీల్ ప్లాష్ బ్యాక్ చెప్పడంతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. కథానాయకుడు ఎన్టీఆర్ తండ్రి నారపురెడ్డి (నాగబాబు)కి విలన్ గా నటించిన బాజిరెడ్డి (జగపతి బాబు) కి మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉంటాయి. వీర రాఘవ (ఎన్టీఆర్ ) పట్నంలో చదువుకుని అప్పుడే సొంత ఊరు వస్తాడు. వీర రాఘవ కోసం వేచి చూస్తున్న బాజిరెడ్డి మందుపాతరలు పెట్టి పేల్చాలని ప్లాన్ చేస్తాడు. ఆ కొట్లాటలో వీర రాఘవ తన విశ్వరూపం చూపిస్తాడు. ఆ గొడవలో వీరరాఘవ తండ్రి నారపురెడ్డి చనిపోతాడు. ఆ కోపంలో బాజిరెడ్డిని వీర రాఘవ చంపేస్తాడు. తండ్రి అంత్యక్రియలు పూర్తవుతాయి కానీ ఆ గొడవలో కొంతమంది అనుచరులు చనిపోవడం, మరి కొంతమంది గాయాలతో బాధపడుతూ ఉండడం చూసి వీర రాఘవ చలించిపోతాడు. తన నానమ్మ ఈ గొడవలు ఇక వద్దని చెప్పడంతో వీర రాఘవ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో సునీల్ కలుస్తాడు. రౌడీలు వెంటపడడంతో వీర రాఘవ ఉన్న గ్యారేజ్ కలుస్తుంది అరవింద (పూజ హెగ్డే) ఆ తరువాత సునీల్ అరెస్ట్ అవ్వడంతో లాయర్ (అరవింద తండ్రి ) దగ్గరకు వెళ్తాడు.ఆ తరువాత అనుకోని పరిస్థితుల్లో అరవింద (పూజాహెగ్డే)కి బాడీ గార్డ్ గా చేరతాడు. అరవింద ఫ్యాక్షన్ కంట్రోల్ మీద రీసెర్చ్ చేస్తుంది. ఇక వీరరాఘవ ను వెతుక్కుంటూ అతడి అనుచరులు తిరుగుతుంటారు. మరో వైపు బాజిరెడ్డి ( జగపతిబాబు ) బతికే ఉండడం ఆయన మనుషులు వీర రాఘవ కోసం వెతకడం అనే ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది.

ఈ క్రమంలో బాజిరెడ్డి కొడుకు బాలిరెడ్డి( నవీన్ చంద్ర) అరవిందని , ఆమె తమ్ముడిని కిడ్నాప్ చేస్తాడు. అయితే.. ఎన్టీఆర్ అరవిందకు ఫోన్ చేసి ఆ ఫోన్ లోనే బాలిరెడ్డిని బెదిరించి వారిని రక్షిస్తాడు. వీర రాఘవ ఒక రాజకీయ నాయకుడి ( రావు రమేష్ ) సలహాతో ఈ ఫ్యాక్షన్ గొడవలకి ముగింపు పలకాలని అనుకుంటాడు. ఈ నేపథ్యంలో బాలిరెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు వీర రాఘవ. అయితే ఆ మీటింగ్ లో బాలిరెడ్డి ఎదురు తిరుగుతాడు. ఆ సమయంలో వీర రాఘవ ఒక చిన్న కధ చెప్పి బాలిరెడ్డికి ఆప్షన్స్ ఇస్తాడు. అయితే ఆ మీటింగ్ కి వెళ్లిన విషయం బాజిరెడ్డికి తెలియడంతో కొడుకు బాలిరెడ్డి నే చంపేస్తాడు. అదే సమయంలో అరవిందని, సునీల్ ని బందించి వీర రాఘవ ముందుకు తీసుకువెళ్తాడు. అయితే అక్కడ ఏమి జరిగింది..? ఎన్టీఆర్ జగపతిని ఎలా మార్చుతాడు..? చివరకి ఏమి జరుగుతుంది..? అనేది కధలో సస్పెన్స్…

విశ్లేషణ:

త్రివిక్రం పెన్ పవర్ కు ఎన్.టి.ఆర్ నటన తోడైతే ఎలా ఉంటుందో దానికి తగినట్టుగా సినిమా ఉంది. వీర రాఘవ పాత్రలో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. సినిమా మొత్తం తారక్ తన భుజాన వేసుకుని నడిపించాడు. ఇక హీరోయిన్ పూజా హెగ్దె కూడా తన ఫెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన మరో హీరోయిన్ ఈషా రెబ్బ కూడా అలరించింది. విలన్ పాత్ర విషయానికి వస్తే బాజిరెడ్డి గా జగపతి బాబు కనిపించిన తీరు సినిమాలో మరో హైలెట్. దాదాపు ఆ పాత్ర అన్ని క్యారెక్టర్స్ ని డామినేట్ చేసిందని చెప్పవచ్చు. ఆయన కొడుకుగా నటించిన నవీన్ చంద్ర ఉన్నంతలో బాగానే చేసాడు. త్రివిక్రమ్ ఎక్కువగా యాక్షన్ ఎమోషనల్ కి సంబందించిన వాటిపై దృష్టిపెట్టాడు. ఫస్ట్ హాఫ్ లో 20 నిమిషాల పాటు సినిమా సూపర్బ్ గా ఉంటుంది. ఇక మిగిలిన ఫస్ట్ హాఫ్ సన్నివేశాలు యావరేజ్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ ఎమోషనల్ పై ద్రుష్టి పెట్టారని చెప్పవచ్చు. రెండు వర్గాల మధ్య జరిగే పోరులో కథానాయకుడు వీర రాఘవ రెడ్డి వ్యవహరించిన తీరు సినిమాకు ప్రధానమైన బలంగా కనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ సినిమాపై అంచనాలు పెంచింది. రెండు పాటలు స్లోగా ఉన్నా పెనివిటి, అనగనగనగా సాంగ్స్ అలరించాయి. సిచ్యువేషన్ గా సాంగ్స్ వర్క్ అవుట్ అయ్యాయి…ఇద్దరు బ్రతకాలంటే ముగ్గురు చావాలా..? లాంటి ఎన్నో డైలాగ్స్ సినిమాలో ప్రేక్షకులనే కాదు రియల్ ఫ్యాక్షనిస్టులని సైతం ఆలోచింపచేసే విధంగా ఉంటాయి అయితే గతంలో ఇలాంటి సినిమాలు వచ్చినా ఎన్టీఆర్ లాంటి ఫ్యాక్షన్ మాస్ సినిమాలు చేసే హీరోతో యుద్ధం వద్దనే విధానాన్ని ఎంతో వైవిధ్యంగా తెరకిక్కించడం కేవలం త్రివిక్రానికే సాధ్యం అయ్యిందని చెప్పాలి…అయితే సినిమా స్లో నేరేషన్ అయినా త్రివిక్రమ్ ఎన్టీఆర్ అభిమానులని నిరాశకి గురికాకుండా చూసాడానే చెప్పాలి.

Aravinda Sametha Veera Raghava Movie Review-

నటీనటుల ఫెర్ఫార్మెన్స్:

ఎన్టీఆర్ వీర రాఘవ రెడ్డి గా ఎంతో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంతేకాదు ఈ సినిమాలో తనదైన శైలిలో పలికిన డైలాగులు మరింత అద్భుతంగా ఉన్నాయి..హీరోయిన్ పూజా హెగ్డే కూడా తనపరిధికి తగ్గట్టుగా నటించింది..నాగబాబు పాత్రలో నటనకి పెద్దగా స్కోప్ లేదు..చిత్రంలో సునీల్ ఉన్నా కామెడీ కి దర్శకుడు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తన పాత్ర ఫెర్ఫార్మెన్స్ కి కూడా పెద్దగా స్కోప్ లోకుండా పోయింది…అంతేకాదు సునీల్ ఈ సినిమాలో పెద్దగా హైలెట్ అయ్యే సీన్స్ కూడా ఏమి లేవు. నరేష్ , బ్రహ్మాజీ అందరికి పరిమితికి తగ్గట్టుగానే నటించారు ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ తరువాత జగపతి బాబు నటన గురంచి ఎక్కువగా మాట్లాడుకోవాలి ఈ సినిమాతో జగపతి మరో సారి తన నటనకి తిరుగులేదని నిరూపించుకున్నాడు..పగ కోసం కొడుకుని సైతం చంపుకునే కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టు గా జగపతి ఓ రేంజ్ లో నటించాడు..జగపతి కొడుకుగా నటించిన బాలిరెడ్డి( నవీన్ చంద్ర) కూడా ఎంతో చక్కగా నటించాడు మొత్తానికి ఎవరి పాత్రల పరిధిలో వారు చక్కగా నటించారు…

ప్లస్ పాయింట్స్:

– త్రివిక్రమ్ డైలాగ్స్

– తమన్ మ్యూజిక్

– ఎన్టీఆర్ నటన

– జగపతి బాబు విలనిజం

– పాటలు

మైనస్ పాయింట్స్:

– కామిడీ లేదు

– కాస్త స్లో నేరేషన్

పెద్దగా మైనస్ లు లేవనే చెప్పాలి..

ఫైనల్ గా – ఎన్టీఆర్ లో మాస్ ని..క్లాస్ ని..ఫ్యాక్షన్ ని..ఫ్యాక్షన్ చాటున నలిగిపోయే గృహిణుల భాధాలని ఎంతో చక్కగా చూపించాడు త్రివిక్రమ్.

తెలుగు స్టాప్ సూచన – ఫ్యామిలో అందరితో కలిసి చూడతగ్గ ముచ్చటైన సినిమా “అరవింద సమేత”

రేటింగ్ – 3.5/5